YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి    పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరలు పోందాలని జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత -సురేష్, ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ ఆన్నారు. మంగళవారం జగిత్యాల రురల్ మండలం చలిగాల్ గ్రామ వ్యవసాయ మార్కెట్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం మోరపల్లి గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్.సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేశ్ తో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ  సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా గా ఎదిగిందని, రైతులకు అనేక సంక్షేమ పథకాల్ని అందిస్తున్న తెరాస ప్రభుత్వమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ప్రభుత్వం అండగా,ఉంటుందని,రైతు పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో 391 కొనుగోలు కేంద్రాలు,నియోజకవర్గంలో 141 వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని రైతు పక్షపాతి ప్రభుత్వమని,ధాన్యం అన్ని కేంద్రాలకు చేరిందని ఎక్కడ ఆలస్యం కాకుండా చూడాలని ప్రోటోకాల్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి త్వరితగతిన ప్రారంభించాలని కొరారు.

జిల్లా కి 1 కోటి 20 లక్షల గొనె సంచులు అవసరం ఉందని బిజెపి నాయకులు, కేంద్రం ఎప్పుడైనా ఆలోచించిందాఅని నేడు తెలంగాణ ప్రభుత్వం జనుము పంటను ప్రోత్సహిస్తూ గొనె సంచులు తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.కేంద్ర వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తేలిపిందని, నియోజకవర్గ పరిధిలో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా అందరూ రైతు దీక్ష  చేపట్టామని,గత సీజన్ లో సివిల్ సప్లై కొర్పొరేషన్ ద్వారా బాంక్ లోన్ 20 వేల కోట్లు తీసుకొని రైతుల ఖాతాల్లో జమ చేసామని,దానికి రోజూ 4 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని,రైస్ మిల్లర్లను ఎఫ్సీఐ వేధిస్తున్నదని,రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయాలని తెలిపారని,దాన్యం నిల్వలు ఇలా మిల్లులలో ఉన్నాయని ఎఫ్సీఐ వైఖరే దీనికి కారణమని అన్నారు.

రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి దేశంలో మరే నాయకునికి లేదని, వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి రైతు శ్రేయస్సు కోసం ,రైతు భీమా,రైతు బంధు,కాళేశ్వరం,వరద కాలువ జీవనదిలా మార్చడం,24 గంటల కరెంట్ వంటి కార్యక్రమాల వల్ల ఉమ్మడి రాష్ట్రం లో కంటే ఇలా 5 రేట్ల ఎక్కువ పంట పండిందని,గతంలో జిల్లాలో రైస్ మిల్లులు 12 ఉంటే 60 కి చేరిందని,నూతన గోదాముల నిర్మాణం ఏర్పాటు చేశామని అన్నారు.నాణ్యమైన దాన్యం తీసుకు వచ్చి నిర్వహికులకు రైతులు సహకరించాలని,తప్ప తాలు లేకుండా చూడాలని అన్నారు .

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు, సర్పంచ్ లు గంగ నర్సు రాజన్న,సత్తమ్మ గంగారాం, అర్బన్ జడ్పీటీసీ మహేష్, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, జిల్లా రైతు బంధు సభ్యులు బాల ముకుందాం,  రైతు సమన్వయ సమితి సభ్యులు నక్కల రవీందర్ రెడ్డి ,జుంబర్తి శంకర్ ,అర్బన్ మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు బండారి విజయ్,బట్టు ప్రవీణ్,చేటపల్లి మోహన్ రెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ రాజేందర్, వ్యవసాయ మరియు మార్కెటింగ్ అధికారులు,ఎంపీడీఓ,డీఏవో , నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts