పగిడ్యాల మండలం లోని ప్రాత కోట గ్రామం లో గెలిచిన టువంటి కాశీశ్వర. నందీశ్వర దేవాలయ నీటిముంపు భూముల వేలం పాటలు ప్రాతకోట గ్రామం లో మంగళవారం నాడు నిర్వహించారు. ఈదేవాలయ భూమి వేలం పాటలో ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రాతకోట గ్రామంలోని కాశికేశ్వర, నందీశ్వరాలయాలకు సంబంధించిన 39 ఎకరాల భూమికి మంగళవారం వేలం దేవదాయశాఖ ఆధికారులు, ఎస్సై నాగార్జున సమక్షంలో పాటలు నిర్వహించారు. రూ.2.65 లక్షల రూపాయలతో వేలం పాటలు ప్రశాంతంగా ముగిశాయి.ఈ సందర్భంగా ఎస్సై నాగార్జున మాట్లాడుతూ.. గ్రామంలో ఆలయాల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాతకోట గ్రామంలో ఇరు పార్టీల నాయకులు ఓకే మాటపై ఉండి గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని. కుట్రలు కుతంత్రాలకు పాల్పడితే. కుటుంబము మరియు గ్రామ అభివృద్ధి ఏమన్నారు. కావున ప్రాత కోట గ్రామం లో నివసిస్తున్న అటువంటి ప్రతి ఒక్కరూ ఎలాంటి గొడవలు. అక్రమ మద్యం. జూదం. సారా. గ్రామములో అమ్మకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడాలన్నారు. పచ్చడి పల్లెల్లో వర్గ పోరు. ఆధిపత్య పోరు. లేకుండా శాంతమైన జీవనం గడపాలని ముచ్చుమర్రి ఎస్ఐ నాగార్జున తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు. బీరవోలు వెంకటేశ్వర్లు. ఎర్రం వెంకట్ రెడ్డి. కుర్వ మల్లయ్య. సగినేల రమణ. డాక్టర్ నాగ శేషులు.బోరెల్లి నారాయణ. ఈదుల చిన్న పకీరయ్య. కుడికిళ్ల భాస్కర్. వెంకట సుబ్బారెడ్డి. తలారి రవి.గ్రామ పెద్దలు, ఆధికారులు, తదితరులు ఉన్నారు.