హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్ లెక్కింపు ప్రక్రియ పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్‌కు 503 ఓట్లు, బీజేపీకి 159 ఓట్లు, కాంగ్రెస్‌కు 35 ఓట్లు పోలవగా, చెల్లనివి 14 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అవడంతో ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితం వెలువడనుంది. కాగా విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో 86.64 శాతం పోలింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే.