YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మరోసారి సీబీఐపై ఏపీ హై కోర్ట్ ఆగ్రహం

మరోసారి సీబీఐపై ఏపీ  హై  కోర్ట్ ఆగ్రహం

అమరావతి
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరోసారి సీబీఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ కేసు విషయంపై మంగళవారం ధర్మాసనం ముందు అత్యవసర విచారణ జరిగింది. రిజిస్టార్ జనరల్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఖాతాల నుంచి పంచ్ ప్రభాకర్ పోస్ట్లు తొలగించి, బ్లాక్ చేశారని ధర్మాసనం దృష్టికి స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ తీసుకువెళ్లారు.  తాము కూడా లెటర్ రాశామని సీబీఐ పేర్కొంది. దీంతో తమరు  లెటర్ రాసి ఉపయోగం ఏమిటని సీబీఐను ధర్మాసనం ప్రశ్నించింది. పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటున్నారో చెప్పాలని సీబీఐను కోర్టు కోరింది. సరైన సమాధానం రాకపోవటంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Posts