YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రపతిని కలిసిన వైకాపా ఎంపీలు టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వినతి

రాష్ట్రపతిని కలిసిన వైకాపా ఎంపీలు టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వినతి

న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతూ,  ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ.. ఈరోజు ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం,  పార్లమెంటరీ పార్టీ నాయకుడు  వి. విజయసాయి రెడ్డి నాయకత్వంలో రాష్ట్రతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతపత్రం సమర్పించారు. తరువాత విజయ్ సాయి మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర పరువు, ప్రతిష్టలను బాబు ఎలా మంటగలుపుతున్నాడో రాష్ట్రపతికి వివరించాం.  సీఎం ను ఇంత దారుణంగా మాట్లాడారా అని రాష్ట్రపతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  టీడీపీ అంతర్థానం కాబోతుంది.. అందుకే బాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది.  టీడీపీది బూతుల కల్చర్.. అదొక తెలుగు బూతుల పార్టీ .  ఆ పదాన్ని చంద్రబాబు రాష్ట్రపతికి ఎందుకు చెప్పలేకపోయాడు.?  ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితుల్లో టీడీపీ లేదని అన్నారు.
చంద్రబాబు తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాడు. తన స్వార్థం కోసం రాష్ట్ర పరువు, ప్రతిష్టలను, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా ఎలా తాకట్టు పెట్టాడో, ఎలా మంటగలిపాడో చూశాం. ఈ విషయాలన్నింటినీ రాష్ట్రపతి కి వివరించామన్నారు.
టీడీపీలో బూతు సంస్కృతి వేళ్ళూనుకుపోయింది, ఆ పార్టీలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, వారు మాట్లాడుకునే భాష చూసినా.. వాళ్ళు ఇతరులను సంభోదిస్తూ మాట్లడే భాష చూసినా.. అలవోకగా బూతు పదజాలాన్ని వాడతారు. ఆ పార్టీ  కల్చరే బూతు కల్చర్.  అందుకే అదొక బూతు పార్టీ అంటున్నాం. తెలుగుదేశం పార్టీకి బదులు..  తెలుగు బూతుల పార్టీ అని నామకరణ చేసుకుంటే బాగుంటుందని అయన అన్నారు.
గత ఏడాదిన్నరగా.. ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయిన చంద్రబాబు ఒక టెర్రరిస్ట్ గా, ఆయన నేతృత్వంలో నడుస్తున్న పార్టీ నేతల సమూహంతో మాట్లాడిస్తున్న అసభ్యకరమైన బూతు భాష ఏ విధంగా ఉందో రాష్ట్రపతిగారికి వివరించి, ఆ పార్టీని రద్దు చేయాలని కోరామని అన్నారు.

Related Posts