కడప
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బద్వేల్లో వైసీపీ అభ్యర్థి సుధ 90,089 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. వైసీపీకి మొత్తం 1 లక్షా 11 వేల 710 ఓట్లు రాగా, బీజేపీకి 21 వేల 612 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ కు 6 వేల 205 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 వేల 635 ఓట్లు వచ్చాయి. దీంతో 90 వేల 089 ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది. బద్వేల్లో మొత్తం 1 లక్షా 46 వేల 546 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్ నుంచే వైకాపా తన ఆధిక్యం చాటింది. ఒక రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సివచ్చింది. బీజేపికి 20 వేల పైచిలుకువచ్చింది. కాంగ్రెస్ కు దారుణంగా ఆరువేల ఓట్ల రావడం, ఆ పార్టీ నేతలకు మింగుడుపడలేదు. బద్వేల్ నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు ఓటు బ్యాంకు అంతంతమాత్రమే. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్కు అక్షరాల 2వేల 148 ఓట్లు పోలయ్యాయి.ఈసారి బీజేపీకి దగ్గరగా.. కాంగ్రెస్ కంటే ఎక్కువగా నోటాకు 3 వేల 31 ఓట్లు పోలవడంవిచిత్రం. పరిస్థితికి అద్దం పడుతోంది. తాము భారీగానే ఓట్లు కొల్లగొడతామని భావించిన కాంగ్రెస్ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. సంప్రదాయాలను గౌరవించి పోటీనుంచి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.