YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హాట్ హాట్ గా టీపీసీసీ భేటీ

హాట్ హాట్ గా టీపీసీసీ భేటీ

హైదరాబాద్
గాంధీభవన్లో బుధవారం నాడు కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం హట్ హాట్ గా జరిగింది. తెలంగా  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష చేసారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, హనుమంతరావు, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,  బల్మూరి వెంకట్ తదితరులు హాజరయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇకపై పార్టీ లో ఏమి జరిగినా నేను స్పందించను. మాణిక్కం ఠాగూర్ అమాయకుడు. .అతనికి పార్టి లో ఏమిజరుగుతుందో తెలవదు. పార్టి పెద్దలు హుజురాబాద్ లో ప్రచారం చేస్తే ఓట్లు పడలేదు. .నేనేళ్తే ఉపయోగం ఏముంటదని అన్నారు.
మరో సినీయర్ నేత వీహెచ్ వేసిన ప్రశ్న లకు నేతలంతా సైలెంట్ అయిపోయారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూర్తిగా మౌనం వహించారు. గతంలో హుజుర్ నగర్ , దుబ్బాక, జీహెచ్ఎంసీ , నాగార్జున సాగర్ లపై ఎలాంటి రివ్యూ జరగడం లేదు. ఓటములపై సమీక్ష జరగకపోవడం వల్లే ఈ రోజు హుజురాబాద్ పరిస్థితి. ఓటములపై గుణపాఠం నేర్చుకోవాలని వీహెచ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, సమవేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీకేంద్రమంత్రి రేణుకాచౌదరి హాట్ హాట్ డిబేట్ నడిచింది. రేణుకా చౌదరీ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భట్టి అనవసరమైన చర్యలతో సమస్యలు వస్తున్నాయని అన్నారు. భట్టీ స్పందిస్తూ రేణుకాచౌదరి మాటలతో విభేదించారుఏ. తాను సీఎల్పీ లీడర్ ను అన్నారు. నీవు సీఎల్పీ అయితే సమస్యలు పరిష్కరించాలే  కానీ సృష్టించ వద్దని రేణుక అన్నారు. మీరు ఇన్వాల్వ్ అయితే పర్ఫార్మెన్స్ పెరగాలే కానీ జీరో ఉండొద్దని రేణుక  ఘాటుగా మాట్లాడారు. రేణుక మాటలకు భట్టీ మౌనం దాల్చారు.

Related Posts