విజయనగరం
విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్ సీ ఎస్ చక్కెర కర్మాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పై రైతులు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటన ఇది. బకాయిలు చెల్లించాలంటూ రైతు సంఘాలతో కర్మాగారం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. రైతు బకాయిలు చెల్లించకుండా గానుగ వేస్తే సహించేది లేదని వారన్నారు. కర్మాగారం భూములు అమ్మి నప్పటికీ బకాయిలు చెల్లించాలంటూ రైతు సంఘాల ఆరోపణ. విజయనగరం టు రాయగడ జాతీయ రహదారిపై రైతులు భైఠాయించారు. దాంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పాడ్డాయి. పోలీసులు రైతులను అరెస్ట్ చేసారు. రైతులు పోలీసులు పై తిరగబడ్డారు. రైతులు ఎదురు దాడితో పోలీసులు పరుగులు తీసారు.