YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నగదు కోసం గగ్గోలు

నగదు కోసం గగ్గోలు

మణుగూరు పట్టణంలో నగదు సమస్య విలయతాండవం చేస్తుంది. ఏజెన్సి ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో మణుగూరు పట్టణం ప్రదానమైనది కావడంతో చుట్టుప్రక్కల ప్రజలు దీనిని అశ్రయించడం తప్పటంలేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు నగదును చేల్లించలేకపోతున్నాయి. కుటుంబ పోషణకు అహర్నిశలు కస్టపడే సామాన్య మానవుని నుండి ప్రభుత్వ ఉధ్యోగి వరకు కష్టపడ్డ సోమ్మును పూర్తిస్ధాయిలో అందుకోలేకపోతున్నారు. ప్రదానంగా పట్టణంలో ఉన్న ఎటియంలు ఎప్పుడు పనిచేస్తాయో ఎవరికి అంతుచిక్కడవం లేదు. అసలే ఏటియంలో అరకోర డబ్బులు పేట్టడంతో క్యూలైన్‌లో నిలుచున్న వ్యక్తులు తమ వరకు నగదు అయిపోతుందని గోగ్గోలు పెడుతున్నారు. మణుగూరు పట్టణంలో కోకోల్లలుగా ఆన్‌లైన్ మనిట్రాన్స్‌పర్ సేంటర్లు కనపడుతున్నాయి. ఎటియంలో డబ్బులు లేక ఆన్‌లైన్ సేంటర్లుకు వేలితే ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారు. ఆన్‌లైన్ సేంటర్‌ల నుండి నగదు పంపాలన్న తిసుకోవాలన్న మోత మోగిస్తున్నారు. వేయ్యి రుపాయలు ట్రాన్స్‌పర్ చేయాలన్న తీసుకోవాలన్న సుమారు ఇరవై నుంచి ముప్పై రుపాయల వరకు చార్జీలు వసుళ్ళు చేస్తున్నారు. ప్రజలు తప్పనిసరి పరిస్ధితులలో నగదు చెల్లించవలసి వస్తుంది. ఇక మణుగూరు పరిసర ప్రాంతాల నుంచి మణుగూరుకు నగదు కోసం వచ్చేవారి పరిస్థితి వేరుగా చెప్పనక్కర్లేదు.బ్యాంకులలో నగదు రాక, కస్టమర్ పాయింట్ వద్ద చేస్తున్న దోపిడీని తట్టుకోలేక వారు పడుతున్న అవస్థలు అంతాఇంతా కావు. ఇక ఆసరా పెన్షన్‌కోసం వచ్చే వృద్ధుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బ్యాంకులలో వేలిముద్రలు పడక, బయట కస్టమర్ పాయింట్లను ఆశ్రయించడం వలన వారు కనీసం వెయ్యికి రూ.30 లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అటు బ్యాంకులలో నిలబడలేక, ఇటు ఎండలో కస్టమర్ పాయింట్ల వద్ద పడిగాపులు పడలేక అనేకమంది వృద్ధులు ఆసుప్రతుల పాలవుతున్నారు. ప్రజల నగదు అవసరాలను ఆసరాగా చేసుకోని సర్వీస్ చార్జీల పేరుతో నిలువుదోపిడి చేస్తున్న మని ట్రాన్స్‌పర్ సెంటర్లపై సంభందిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

Related Posts