న్యూఢిల్లీ,
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి COP26 ప్రపంచ నాయకుల సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని మోడి స్కాట్లాండ్లోని గ్లాస్గోకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన అనంతరం ఇండియాకు మోడీ బయలుదేరే ముందు స్కాట్లాండ్లోని భారతీయులు వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. వారితో ప్రధాని మోడీ డ్రమ్స్ వాయిస్తూ సంభాషించారు. అనేక మంది భారతీయ సంప్రదాయ దుస్తులు, తలపాగాలు ధరించి వచ్చారు. భారతీయుల్లోని పలువురు సభ్యులు మోడీతో కరచాలనం చేశారు. మోడీ డ్రమ్స్ సహాయంతో బీట్స్ వాయించారు. పీఎం మోడీ అనేక కుటుంబాలతో అప్యాయతగా మాట్లాడారు. కొంతమంది పిల్లలను తలపై నెమిరారు. కొంతమంది చిన్న పిల్లలతో కరచాలనం చేశారు