YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఐదేళ్లలో నగరంలోకి 50వేల వాహనాలు

ఐదేళ్లలో నగరంలోకి 50వేల వాహనాలు

హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ  ప్రాంతంలో వాహనాల వినియోగం పెరుగుతోంది. హైద్రాబాద్ లో వాహానాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.  దాదాపు టూ వీలర్స్ , ఫోర్ వీలర్స్...అన్ని లెక్క పెట్టుకుంటే... ప్రతి ఐదుగురిలో ఒకరికి వాహానం ఉంది. అయితే  అధికారులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగరాభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని చెబుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితమే ఆదేశించింది. నగరంలో ప్రజారవాణా కోసం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఎంఎంటిఎస్ సబర్బన్ రైళ్లతోపాటు అద్దె కార్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ప్రజా రవాణా కోసం ఆర్టీసీ 3850 బస్సులను నడుపుతుండగా ఆ టోలు లక్ష 25 వేలు, క్యాబ్స్ 25వేలకు పైగా ఉన్నాయి. ఐటీ కంపెనీల్లో పని చేసివారికి పగలు, రాత్రి లేకుండా కార్లు అం దుబాటులో ఉన్నాయి. వీటన్నింటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నియంత్రణలోకి తీసుకు రావాలని సూచించింది. రవాణాశాఖ, ఆర్టీసీ, జిహెచ్‌ఎంసి, పోలీసులు శాఖ లు సమన్వయంతో మెరుగైన రవాణా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించింది. దానికి అనగుణంగానే అప్పట్లోనే ఆర్టీసీకి సంబంధించి రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డితో పాటు ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులు మంబా యి వెళ్లి అధ్యయనం చేశారు. ముంబయ్‌లో ‘క్యూ’ సిస్టమ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. భద్రతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ ఆదేశించినా ఆయా శాఖల అధికారులు మెక్కుబడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రజారవాణా లో కీలకమైన ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలు వం టి వాటిలో జిపిఎస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక నియంత్రణ వ్య వస్థను రూపొందించాలని ఆదేశించారు. ఇవన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన చందంగా తయారైంది. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఆర్టీసీలో పలు ఏర్పా ట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో జిపిఎస్ పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే జిపిఎస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆర్టీసీ బస్సుల రాకపోకలను తెలిసే వివరాలను ఏర్పాటు చేయాలి. కాని అ ధికారులు చేసిన అరకొర ఏర్పాట్లు చేసిన కారణంగా అది మంచి ఫలితాలను ఇవ్వలేక పోయింది. ఇక పోతే మహిళ భ్రదతకు సంబంధించి సుమారు వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సు లో పార్టీషన్స్ ఏర్పాటు చేశారు. ప్రైవేట్ రవాణా వాహనాల తో ఆర్టీసీకి నష్టం వస్తున్నా రవాణా శాఖ అధికారులు చూసీచూడనుట్ల వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల దోపిడే పరమావధిగా ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.ఐదేళ్లలో ట్రాఫిక్ భారం 2.50 లక్షల నుం చి 3 లక్షల (50వేలు పెంపు)కు చేరింది. నగరానికి చేరు కునే వారి సంఖ్య 7 లక్షల నుంచి 8.30 లక్షలుగా పెరి గింది. సరుకుల రవాణా వాహణాలు 48 వేల నుండి 53.50 వేలుగా నమోదైనట్టు అధ్యయన సంస్థ సాంకేతిక సలహా సంఘా(టిఎసి)నికి వివరించినట్టు సమాచారం. 100 కి.మీ.ల దూరంలోపున్న ప్రాంతాల నుండి నగరాని కి రాకపోకలు సాగించే వాహనాలు 2011లో 38,100 ఉంటే 2017లో 43,567గా నమోదైనట్టు వెల్లడించింది.గత ఐదేళ్లలో నగరా నికి రాకపోకలు సాగించే వాహనాలు 50వేలు పెరిగాయి. లక్షా 60 వేల నుంచి 2.10 లక్షలుగా నగరానికి శివారు నుంచి ప్రయాణాలు సాగిస్తున్నట్టు ఒక అధ్యయ నంలో వెల్లడైంది. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్-రవాణా వ్యవస్థపై సమగ్ర రవాణా అధ్యయనం  చేస్తున్న కన్సల్టెన్సీ తన తాజా నివేదికలో వెల్లడించింది. గతంలో సూచించి నట్టుగా హెచ్‌ఎండిఎ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా విస్తరించాల్సిన అవసరమున్నదని కన్సల్టెన్సీ పేర్కొన్నట్టు తెలిసింది. ట్రాఫిక్-రవాణా రంగాలకు చెందిన అధికారులు, నిపుణులతో కూడినదే సాంకేతిక సలహా సంఘం. ఈ సంఘం సమావేశం ముందుకు లీ అసోసియేట్స్ తన నివేదికను అందించినట్ట్టు సమాచా రం. హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు అధ్యక్షతన ఈ టిఎసి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో వ్యక్తిగత వాహ నాలు, ప్రజా రవాణాకు చెందిన వాహనాల వినియోగం, నగరానికి రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్, ప్రజా వాహ నాల విషయాలను కన్సల్టెన్సీ వివరించినట్టు తెలిసింది.నగర శివారులోని ఔటర్ రిం గ్ రోడ్‌కు వెలుపల జాతీయ, రాష్ట్రీయ, పట్టణ రహదారు ల మీదుగా నగరానికి రాకపోకలు సాగిస్తున్న వాహనాల పై 16 ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే వివరాలను టిఎసి సమావేశంలో లీఅసోసియేట్స్ ప్రతినిధులు వివరించిన ట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వాహనాలు 5700లుగా పెరిగాయి. 2011లో 7600లుగా, 2017లో 13,300లుగా పెరిగా యి. శివారు జిల్లాలైన గుంటూరు, కృష్ణ, 20వేలు పెరిగా యని నివేదికలో వెల్లడించింది. రవాణా వాహనాలు మా త్రం 7.3 శాతం తగ్గినట్టు నివేదికలో పేర్కొన్నది. 2021 నాటికి న గరంలో ప్రజారవాణా వ్యవస్థను ప్రజలకు మరింత అం దుబాటులోకి తీసుకురావాలని అందులో భాగంగానే మె ట్రోరైలు సదుపాయాలను 162 కి.మీ.లు, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంను 57 కి.మీ.లు, ఎంఎంటిఎస్‌ను 193 కి.మీ.లు, రైల్వే ప్రయాణికుల ప్రాంగణాలు-2, బస్సు ప్రాంగణాలు-9, సైకిల్ ట్రాక్‌లు 31 విస్తరించాలని సిటిఎస్ నివేదిక వెల్లడించింది.నగరంలోకి ప్రవేశించే వ్యక్తిగ, ప్రైవేట్ వాహనాల వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగు తుంది. తద్వారా ఉష్ణోగ్రతలు హెచ్చుతాయి. ట్రాఫిక్ స మస్య, వాహనాల రద్దీ, ప్రమాదాలు వంటివి పెరిగి నగర ప్రయాణం సమస్యల వలయంగా మారుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్దంగా ప్రజా రవాణా వ్య వస్థను విస్తరించడం, త్వరగా వినియోగంలోకి తీసుకురా వడం, శివారులో పెరుగుతున్న వాహనాల రాకపోకలకు అనుకూలంగా రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉం టుందనేది రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Related Posts