YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం…

అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం…

నెల్లూరు
నెల్లూరు నుండి చెన్నైకు వెళ్ళు తమిళనాడు ఆర్టీసీ బస్సులో ఎటువంటి లెక్కలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 66,56,900 రూపాయలను దొరవారిసత్రం పోలీసులు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గూడూరు డీఎస్పీ.రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... చెన్నై రాష్టానికి చెందిన బస్ లో  అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా  అందులో ఎటువంటి లెక్కల పత్రాలు లేని నగదు 66,56,900 రూపాయలు  ఉండడంతో ఆ నగదును సీజ్ చేసి నగదు కలిగి ఉన్న చెన్నైకు చెందిన కిరణ్,విష్ణులను అదుపులోకి తీసుకున్నామని,వీరి పై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు..

Related Posts