YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గుడుంబా రహిత జిల్లాల కోసం కృషి

గుడుంబా రహిత జిల్లాల కోసం కృషి

గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కల్తీ కల్లు మరణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కల్తీ కల్లు నియంత్రణ యంత్రాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ యంత్రంతో కల్తీ కల్లును నిమిషాల్లోనే గుర్తించగలమన్నారు. మద్యంలో నీళ్లు కలిపి సీల్ వేసి అమ్ముతున్న సంఘటనలను అరికట్టేందుకు హైడ్రోమీటర్‌ను ప్రారంభించారు.ఈ మీటర్‌ను మద్యంలో వేస్తే ఎంతమేరకు నీళ్లు కలిపారో వెంటనే తెలిసిపోతుందని నిపుణులు వివరించారు. రాష్ట్రంలో కల్తీ కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెంటనే ఈ యంత్రాలను పంపి దాడులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతికి చోటులేకుండా పనిచేస్తున్న అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ధూల్‌పేటలో గుడుంబా దాడుల కోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నట్లు పేర్కొన్నారు. గుడుంబా తయారీ నుంచి బయటపడ్డవారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గుడుంబా స్థావరాలపై వరుస దాడులు చేస్తున్నారు. ఎక్సైజ్ సిబ్బందికి ప్రతిరోజూ పెట్రోలింగ్ చేసేందుకు వీలుగా వాహనాలకు సైరన్లు బిగించారు. విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి యూనిఫాం ధరించాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా రహిత జిల్లా ప్రకటించేందుకు గుడుంబా స్థావరాలపై గురి పెట్టింది. వరుస దాడులు నిర్వహించి నాటుసారా, బెల్లం పానకాలను ధ్వంసం చేశారు. కొంత మంది తయారీదారులపై కేసులు నమోదు చేయగా.. మరికొంత మందికి హెచ్చరికలు జారీ చేశారు. మొదటిసారి దొరికితే కౌన్సెలింగ్ చేస్తున్నారు, రెండోసారి కేసులు నమోదు చేస్తున్నారు. మూడు, నాలుగోసారి పునరావృతమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జిల్లా వ్యాప్తంగా 345 కేసులు నమోదు కాగా.. 33 మందిని అరెస్టు చేశారు. ఇందులో 141 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. గతేడాది నలుగురిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను గుడుంబా రహిత జిల్లాలుగా ప్రకటించనుంది.ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మద్యం స్థావరాలపై దాడులను ముమ్మరం చేశారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహించి తయారీ దారులను అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. గుడుంబాతో కలిగే అనర్థాలను గిరిజనులకు వివరించి గుడుంబా తయారీకి పాల్పడకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.జిల్లాలో ఎక్కువగా మారుమూల, గిరిజన ప్రాంతాల్లో గుడుంబాను ఎక్కువగా తయారు చేస్తున్నారు. నాటుసారాను శాశ్వతంగా రూపుమాపాలంటే మారుమూల ప్రాంతాల్లో గుడుంబా కాస్తున్న తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఎక్కడెక్కడ గుడుంబా తయారు చేస్తున్నారో గుర్తించాలని కలెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ అబ్కారీ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అబ్కారీ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. గుడుంబా తయారీదారులు 30 మందికిపైగా ఉన్నట్లు గుర్తించారు. వీరికి గుడుంబాతో కలిగే అనర్థాలను వివరించారు. గుడుంబా తయారు చేయకుండా అవగాహన కల్పించారు. గుడుంబా తయారీవైపు వెళ్లకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా, పరిశ్రమల శాఖ, ఐటీడీఏ ద్వారా వారికి రుణాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో గుడుంబా తయారీదారులను, బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రుణాల అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Related Posts