YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ భవిష్యత్తు..అంతేనా

కాంగ్రెస్ భవిష్యత్తు..అంతేనా

విజయవాడ, నవంబర్ 5,
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇక ఏమాత్రం కోలుకోలేదని అర్థమయిపోయింది. బద్వేలు ఉప ఎన్నిక ద్వారా మరోసారి రుజువయింది. బద్వేలు ఉప ఎన్నికను కాంగ్రెస్ నేతలు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. పేరుకు అనేక మంది నేతలున్నప్పటికీ బద్వేలు వైపు కాంగ్రెస్ నేతలు ఎవరూ కన్నెత్తి చూడలేదు. బద్వేలు ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చింది. ఈ సమయంలో ఐక్యత ప్రదర్శించాల్సిన నేతలు షరా మామూలుగానే తమకు పట్టనట్లే వ్యవహరించారు.బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరూ అనుకోరు. మాజీ ఎమ్మెల్యే కమలమ్మను బరిలోకి దించారు. అభ్యర్థి ఎంపిక వరకూ బాగానే ఉన్నా ప్రచారంలో మాత్రం పూర్తిగా వెనకబడిందనే చెప్పాలి. ఇక్కడ గెలుపు కంటే బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించడానికి కృషి చేయాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో చూపించుకుంటే కొద్దో గొప్పో కేంద్ర నాయకత్వానికి అయినా చెప్పుకునే వీలుంటుంది.అయితే కాంగ్రెస్ నేతలు ఆ ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో అనేకమంది నేతలున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులు పొందిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు వంటి నేతలున్నారు. కానీ వీరెవ్వరూ బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో కన్పించలేదు. పార్టీ పట్ల వీరికున్న సీరియస్ నెస్ ఎంతనేది అర్థమయింది.వీరు ప్రచారానికి వస్తే పూర్తిగా సీన్ ను మారేస్తారని కాదు. ప్రచారంలో పాల్గొంటే పార్టీ క్యాడర్ లో జోష్ నెలకొంటుంది. నేతల్లో కూడా ఆత్మస్థయిర్యం దక్కుతుంది. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లకు ధీమా దొరుకుతుంది. కానీ వీరెవ్వరూ కనీసం కాంగ్రెస్ కు కొంత ఓటు బ్యాంకును సాధించిపెట్టాలన్న ప్రయత్నం చేయకపోవడం చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన వంటి పార్టీలే తప్పుకున్నా బరిలోకి దిగిన కాంగ్రెస్ నేతల వల్లనే నవ్వుల పాలయిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి

Related Posts