హైదరాబాద్ : ఏడాది నుంచి పదేళ్ల కాల పరిమితి గల డిపాజిట్ల పై వడ్డీ ని ఆంధ్ర బ్యాంకు 10 - 25 బేసిస్ పాయింట్లు పెంచింది. రూ.కోటి కన్నా తక్కువ మొత్తం డిపాజిట్ల ఫై 1 - 2 ఏళ్ళకు ఇప్పటివరకు 6 . 5 శాతం వడ్డీ రేటు ఉండగా, ఇప్పటినుంచి 6 . 6 శాతం వడ్డీ చెలించనుంది. రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు చేసే డిపాసిట్లు ఫై వడ్డీని 6 .25 శాతం నుంచి 6 .5 శాతంగా మార్చింది. బల్క్ డిపాజిట్ల ఫై కాల పరిమిత వాడి రేట్లను 35 - 175 బేసిస్ పాయింట్లు పెంచింది. సవరించిన వడ్డీ రేట్లను సోమవారం నుంచి అమలు పరుస్తున్నట్లు ఆంధ్ర బ్యాంకు తమ వెబ్ సైట్ లో పెట్టింది.