డెహ్రాడూన్
ఉత్తరాఖండ్ లోని ని రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్ నాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ పూజలు చేశారు. తరువాత అయన కేదార్ నాథ్ ఆలయం శివునికి అంకితం చేశారు. మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ఆలయం నాలుగు పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటి . దీనిని చార్ ధామ్ యాత్ర అని పిలుస్తారు . ఇందులో యమునోత్రి , గంగోత్రి , బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయ పర్యటన కోసం శుక్రవారం డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
డెహ్రాడూన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ( రిటైర్డ్ ) , సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు . 2013 ఉత్తరాఖండ్ వరదల్లో విధ్వంసం తర్వాత పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రధాని ప్రారంభించారు. ఉత్తరాఖాండ్ లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రధాని మోదీ ప్రార్ధనలు చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ముందు కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లు చేశారు . రూ .130 కోట్లతో నిర్మించిన సరస్వతి రిటైనింగ్ వాల్ , ఘాట్లు , మందాకిని రిటైనింగ్ వాల్ , తీర్థ పురోహిత్ హౌస్లు , మందాకిని నదిపై గరుడ్ చట్టి వంతెనలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పీఎం మోదీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ పర్యటించడం విశేషం.ప్రధాని తన పదవీ కాలంలో ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి . మోదీ గతంలో చివరిసారిగా 2019 లో కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు.