టీడీపీ కి అభ్యర్థులను పెట్టుకునే దిక్కు కూడా లేదు అనైతిక పొత్తులకు వెంపర్లాడుతున్నారు 54 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగిస్తున్నాం 40 డివిజన్ లో ప్రపోజల్ చేసే వ్యక్తి కూడా లేక టిడిపి దుస్థితి మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్ లలో అభ్యర్థులు పెట్టుకునే దిక్కు కూడా తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని రమేష్ రెడ్డి నగర్ లో శుక్రవారం 25డివిజన్లు అభ్యర్థిల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి 54 డివిజన్ లలో కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను నిలబెట్టుకోవడం చేతకాక తాము విధించామని అవాస్తవాలు చెప్పడం సరికాదన్నారు. 40 వ డివిజన్ లో కనీసం ఆ పార్టీ అభ్యర్థిని ప్రపోజల్ చేసే దానికి కూడా ఒక మనిషి రాలేదన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనైతిక పద్ధతులకు పాల్పడ్డాడనే ధ్వజమెత్తారు. సిపిఎంతో చర్చలు విఫలం అయ్యాయని, సీపీఐకి ఒక సీటు కేటాయించారని, మరోవైపు జనసేన తో చర్చలు జరపటం ఇంతకన్నా నీచమైన రాజకీయాలు ఉండవన్నారు. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో మొత్తం 54 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి ఖాయమని మంత్రి అనిల్ పేర్కొన్నారు.