YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎపి సిఎంపై మండిపడ్డ బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్

ఎపి సిఎంపై మండిపడ్డ  బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్

తిరుపతి
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. కేంద్రం పెట్రో డీజిల్ ధరలు తగ్గించింది. దేశంలోని అనేక బీజేపీ రాష్ట్రాలు ధరలు తగ్గించాయి. ఏపీ ప్రభుత్వం ధరలు తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని అయన అన్నారు. లేని పక్షంలో బిజేపీ ప్రజా ఉద్యమానికి దిగుతోంది. ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిల్యూర్. ఎపిలో పరిపాలన అస్థవ్యస్థంగా మారింది. రాష్ట్ర ప్రజలు వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎపిలో పెట్రోల్, డీజల్ పై పన్నుల రేట్లను ఎందుకు తగ్గించడం లేదు. బీజేపీ  రాష్ట్రాలతో పోలిస్తే ఎపిలో డీజిల్, పెట్రోల్ ధరలు చాలా ఎక్కువ. పాలన చేతకాక పోతే భారం ప్రజలపైనే పడుతుందన్న విషయం జగన్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు.

Related Posts