నందిగామ
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నాలుగేళ్లు అయిన సందర్భంగా ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నందిగామ పట్టణంలోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర చేసారు ,ముందుగా పార్టీ కార్యాలయం నుండి పాదయాత్ర ప్రారంభించి గాంధీ సెంటర్లోని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ,కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ,
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మార్చిందని తెలిపారు ,ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందిస్తున్న ప్రజా సంక్షేమ -అభివృద్ధి కార్యక్రమాలతో సగర్వంగా ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు ,రాష్ట్రమమతా 13 జిల్లాలు దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుని , అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజలకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ -అందించిన పథకాలను ప్రజల్లోకి వెళ్లి వివరించిన ఘనత ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు .
అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి- సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన చేస్తున్నారని ,సీఎం జగన్ సహకారంతో నందిగామ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ,ఇప్పటికే గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరిగిందని ,అదేవిధంగా అర్హులైన ప్రజలకు ప్రభుత్వ అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసి వారికి లబ్ధి చేకూరుస్తున్నామన్నారు ,
పాదయాత్రకు విశేష స్పందన ..
అరుణ్ కుమార్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ,పాదయాత్ర సందర్భంగా నందిగామ పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది ,పార్టీ నాయకులు- కార్యకర్తలు టపాసులు కాల్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ..