రాజమహేంద్రవరం
పెట్రోల్ , డీజిల్ ధరలపై ఏపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించక పోవడాన్నీ నిరశిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు రాజమండ్రి లో ధర్నా లో పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ అన్ని జిల్లా, పార్లమెంట్ కేంద్రాల వద్ద బిజెపి ధర్నా లు కొనసాగిస్తోంది. ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యమం తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. అమరావతి లో రాజధాని నిర్మాణం చేయకుండా పెట్రోల్, డీజిల్ పై సెస్సు ఏవిధంగా వసూలు చేస్తారని ప్రభుత్వాన్ని సోమువీర్రాజు సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఇతర రాష్ట్రాల మాదిరిగా తగ్గించకుంటే ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం టాక్స్ లు వేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.