YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

హైదరాబాద్ లో సైకో కిల్లర్స్

హైదరాబాద్ లో సైకో కిల్లర్స్

హైదరాబాద్, నవంబర్ 6
సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసును హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించారు. చెప్పిన మాట వినలేదని ప్రాణాలు తీస్తున్న సైకో కిల్లర్ను అరెస్ట్ చేసిన నగర  పోలీసులు రిమాండ్కు తరలించారు.చిన్నప్పటి నుండి తండ్రి వేధింపుల భరించలేక ఇంటి నుంచి పారిపోయిన ఓ వ్యక్తి.. చెడు అలవాట్లకు బానిసై తన అవసరాల కోసం  హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లై అయిదురు పిల్లలు ఉన్నా.. వారిని వదిలి.. పక్క రాష్ట్రం నుండి హైదరాబాద్ నగరానికి వచ్చి సిరియల్ కిల్లర్గా  మారాడు. నగరంలో అర్థరాత్రి పూట సంచరిస్తూ.. తెలిసిన వారిని బెదిరిస్తాడు.. మాట వినక పోతే రాళ్లతో మోది అత్యంత దారుణంగా హతమారుస్తాడని పోలీసులు తెలిపారు.  ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురిని అకారణంగా చంపిన కిరాతకుడిని నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.కర్ణాటకకు చెందిన మహ్మద్ ఖదీర్ తన 15వ సంవత్సరంలోనే తండ్రి హింసలు భరించలేక ఇంట్లో నుండి పారిపోయి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇలా నగరంలోని ఆటో నడుపుతూ.. అడ్డకూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిసించాడు. ఈ క్రమంలోనే ఖదీర్కు పెళ్లి కూడా అయింది. అయిదుగురు పిల్లలు కూడా ఉన్నారు. కాని ఖదీర్ కొద్ది రోజుల తర్వాత సైకోగా మారాడు. తన పిల్లలు, భార్యను వదిలి ఫుట్పాత్ జీవితానికి వచ్చాడు. చిల్లర పనులు చేస్తూ.. రాత్రిపూట నాంపల్లిలోని ఏక్ మీనార్ వద్ద ఫుట్వద్ద నిద్రిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.  ఈక్రమంలోనే తన అవసరాలను తీర్చుకునేందుకు సైకో మారాడు. అంతేకాదు పలువురి ప్రాణాలు తీస్తూ వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నట్లు పోలీసులు  వెల్లడించారు. ఖదీర్ ఇలా.. గత నెల 15న నగరంలోని ముర్గి మార్కెట్ పరిధిలోని ఓ బిచ్చగాడు నిద్రిస్తుండగా.. అతని జేబులో నుండి చిల్లర డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ బిచ్చగాడిని బలంగా నేలకు నెట్టెయడంతో వెన్నుపూస విరిగి మృతి చెందాడు. అనంతరం గత  నెల 31న అర్ధరాత్రి మద్యంలో మత్తులో ఖదీర్ ఓ వ్యక్తి వద్దకు వెళ్లి ముందుగా అగ్గిపెట్టె అడిగాడు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోవడంతో అక్కడే ఉన్న సిమెంట్ దిమ్మెతో తలపై మోదాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతిడి జేబులో ఉన్న 100 రూపాయలతో పాటు మద్యం సీసా తీసుకుని పారిపోయాడు. ఇక, అదే రోజు నాంపల్లిలో తనకు తెలిసిన ఖాజా అనే ఆటో డ్రైవర్ వద్దకు వెళ్లి ఆటోలో పడుకోవడానికి అవకాశం ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆటో డ్రైవర్ నిరాకరించడంతో. క్షణం ఆలోచించకుండా. రాయితో మోది ఖాజాను సైతం హత్య చేశాడు.ఇదిలావుంటే, 15 రోజుల్లో ముగ్గురు వ్యక్తులు హతమవడం హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎట్టకేలకు దొరకుండా తప్పించుకు తిరుగుతన్న ఖదీర్ చివరకు నాంపల్లిలోని ఓ హొటల్ వద్ద అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. తమదైనశైలిలో విచారణ చేపట్టడంతో అసలు మూడు హత్యలకు సంబంధం ఉన్నట్లు తేలిపోయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు

Related Posts