YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి కేటీఆర్ కు నేరెళ్ల సెగ...

 మంత్రి కేటీఆర్ కు నేరెళ్ల సెగ...

రాజన్న సిరిసిల్ల
జిల్లా కేంద్రంలోని కేడిసిసి బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించడానికి మరియు అడవి భూములు సమస్యలపై కలెక్టరేట్ లో సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. అయితే, అయన నేరళ్ల బాధితుడు కోల హరీష్ ఇంటి ముందు నుండే రావాల్సివచ్చింది. నేరెళ్ల బాధితులు కోల హరీష్, బానయ్య మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఫ్లకార్డులతో నిరసన తెలుపుతూ అడ్డుకున్న ప్రయత్నం చేసారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తరువాత తోపులాట జరిగింది. నేరెళ్ల బాధితుడు కోల హరీష్ ఇంటి ముందు  వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ ముఖం మరోవైపుకు తిప్పుకున్నట్లు సమాచారం. మంత్రి పర్యటన నేపధ్యంలో నేరెళ్ల బాధితులు కోల హరీష్ ఇంటిముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు.  కోల హరీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితుల పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ ఓలక పోస్తూ దళితుల గొంతు నొక్కేస్తుంది. తెలంగాణలో దళితులకు కెసిఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. నేరెళ్ల ఘటన జరిగి ఐదేళ్లు కావస్తున్నా దళితులకు న్యాయం జరిగిందే లేదు. నేరెళ్ల బాధితులపై తప్పుడు హత్య కేసులు బనాయించారు. నేరెళ్ల బాధితులకు థర్డ్ డిగ్రీ చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని విమర్శించారు.

Related Posts