చిత్తూరు
పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. కుప్పం లో జరిగిన బహిరంగ సభలో పూతలపట్టు ఎమ్మెల్యే కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి పైన పచ్చి బూతులు మాట్లాడటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నికి విరుద్ధం. ముఖ్యంగా కుప్పంలో నీకు ఓటు ఉందా? నీకు ఇల్లు ఉందా? అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన బాబు.. ముందు తనకి పూతలపట్టులో ఓటు, ఇల్లు ఉందా? అని సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా కుప్పంలో 7 సార్లు గెలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి పైన బూతులు మాట్లాడటం, ఇదే వేదిక పైన ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ముఖ్య మంత్రి నారాయణస్వామి చోద్యం చూస్తుండటం సిగ్గు చేటు. తన సొంత గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా ఓడిపోయినా, జడ్పీటీసీ గా ఓడిపోయినా, ఈ రోజు పూతలపట్టు లో 30 వేలతో గెలిపిస్తే ప్రజలకు సేవ చేయకుండా బూతులు మాట్లాడటం చాలా దురదృష్టకరం. విచిత్రం, ముందుగా తన పైన తన సొంత పార్టీ జెడ్పిటిసి చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పి ,తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ గా డిమాండ్ చేస్తున్నాం. పూతలపట్టు ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ గా హెచ్చరిస్తున్నాం.ఈ పత్రికా విలేకరుల సమావేశంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజు, టిడిపి క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్ మేషాక్, తవనంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు దిలీప్ నాయుడు, చిత్తూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు శశికర్ బాబు, మండల జనరల్ సెక్రటరీ మధు యాదవ్ ,టిడిపి నాయకులు రాజా, మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ కుప్పయ్య, కుమార్ ,జైపాల్, పాల్గొన్నారు