హన్మకొండ
అధికార తెరాస పార్టీ విజయఘర్జన సభ స్థలసేకరణ తీవ్ర వివాదాస్పదమవుతోంది. పార్టీ స్థాపించి 20ఏళ్ళు అయిన సందర్భంగా వరంగల్ లో భారీ సభకు కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. హన్మకొండ జిల్లా దేవన్నపేట శివారులో సభ ప్రాంగణం ఏర్పాటుకు స్థానిక నేతలు నిర్ణయించారు. 1500 ఎకరాలలో విజయఘర్జన సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. . ఆదిలోనే హంసపాదులా దేవన్నపేట రైతులు తిరుగబడ్డారు. విజయగర్జన సభకు ఎట్టిపరిస్థితుల్లోనూ పంట పొలాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసారు. స్థల పరిశీలనకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో రైతుల వాగ్వివాదానికి దిగారు.
పోలీసు జవానుపై తెరాస నేత జూలుం :
వరంగల్ జిల్లా నర్సంపేటలో అధికార పార్టీ నేత పోలీస్ కానిస్టేబుల్ పై జులుం ప్రదర్శించాడు. నా కారునే ఫోటో తిస్తావా అంటూ బెదిరించాడు. మీ సీపీకి చెప్పుకున్న నన్ను ఏమీ చేయలేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ మధ్య నిబంధనలు పాటించని వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నర్సంపేట అంగడి సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నిబంధనలు పాటించకుండా వెళ్తున్న ఓ కారు ఫొటో తీశాడు. ఈ ఘటనతో అసహనానికి గురైన నర్సంపేట పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి కారు దిగి సంబంధిత కానిస్టేబుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సొసైటీ చైర్మన్ పరుషపదజాలంతో దూషించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.