YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అవనిగడ్డ నియోజకవర్గం నుండి పవన్ పోటీ ??

అవనిగడ్డ నియోజకవర్గం నుండి పవన్ పోటీ ??

జనసేన 175  అసెంబ్లీ  స్థానంలో పోటీ చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రెస్ ముందు వెల్లడించారు.కానీ  జనసేన అభిమానులకి , కార్యకర్తలకి పవన్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అని సందేహం నెలకొంది.  గతం లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇప్పుడు మరో వార్త బయటికి వచ్చింది. రానున్న ఎన్నికలలో అయన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని జనసేన ఇన్ ఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 
 

Related Posts