YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేన, టీడీపీ కలిసే పోటీనా..

జనసేన, టీడీపీ కలిసే పోటీనా..

విజయవాడ, నవంబర్ 8,
రాజీకీయాల్లో పరిణామాలకు అనుగుణంగానే పార్టీలు మారాల్సి ఉంటుంది. ఒకే పార్టీని నమ్ముకుని కూర్చుంటే అధికారం దక్కదు. ఈ విషయం ఏపీ రాజకీయ నేతలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఎన్నికలకు ముందు వలసలు ఎక్కువగా ఏపీలోనే ఉంటాయి. ఇప్పుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మరో పార్టీలోకి వెళుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన త్వరలోనే జనసేన పార్టీలోకి వెళతారంటున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో అన్ని సామాజికవర్గాల అండ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే జనసేనలో నాదెండ్ల మనోహర్ కు కీలక పదవి ఇచ్చారు. ఇక కామినేని శ్రీనివాస్ ను కూడా తీసుకుని పార్టీలో కీలక పదవి ఇవ్వాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉంది. ఆయనకు కండువా కప్పి ప్రధానంగా కృష్ణా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.కామినేని శ్రీనివాస్ తొలుత ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరి కీలకంగా మారారు. నిజాయితీ ఉన్న నేతగా కామినేని శ్రీనివాస్ కు పేరుంది. ఆయన రాజకీయాలు కూడా పారదర్శకంగా ఉంటాయి. 2014 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి తర్వాత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే జనసేన, బీజేపీ పొత్తు ఉంది. ఆయన నిజానికి పార్టీ మారాల్సిన అవసరం లేదు.కామినేని శ్రీనివాస్ ఇప్పుడు బీజేపీలో పెద్దగా యాక్టివ్ గా లేని మాట వాస్తవమే. కానీ ఇప్పుడు జనసేనలో చేరాలన్న ఆలోచనను కామినేని శ్రీనివాస్ చేశారంటే బీజేపీ, జనసేనకు విడాకులు తప్పేట్లు లేవన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నుంచి జనసేనలో చేరితే ఆ ప్రచారానికి మరింత క్లారిటీ వస్తుంది. మొత్తం మీద జనసేనలో కామినేని శ్రీనివాస్ చేరతారన్న ప్రచారమయితే బాగానే జరుగుతుంది.

Related Posts