YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ లెక్కేంటీ...

లోకేష్ లెక్కేంటీ...

విజయవాడ, నవంబర్ 8,
పార్టీని ముంచినా తేల్చినా లోకేషేనట. నారా లోకేష్ పై నాయకుల్లోనే నమ్మకం ఏర్పడటం లేదు. పార్టీని నడిపించడం ఆయన వల్ల కాదని అనేక మంది నేతలు తేల్చేశారు. విపక్షంలో ఉన్న సమయంలో నాయకుడిగా ఎదగాల్సి ఉన్నా లోకేష్ లో ఆ ఫైర్ లేదన్నది వాస్తవం. ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో మాట్లాడేసి హైదరాబాద్ లో ఉండటం తప్ప లోకేష్ ఈ రెండున్నరేళ్లలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు స్వల్పమేనని చెప్పాలి.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటూ నాయకుడిగా ఎదగలేకపోయారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించి ఆయన నాలుగు గోడలకే పరిమితమయ్యారు. ఇక తాను ఓటమి చెందడమే కాకుండా, పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పుడు నిత్యం జనంలో ఉండేలా చూసుకోవాలి. కానీ లోకేష్ ఎప్పుడూ రెస్ట్ మోడ్ లో ఉంటాడన్నది పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న టాక్. లోకేష్ జనంలోకి వెళ్లేందుకు కాని, కార్యకర్తలను కలిసేందుకు కాని పెద్దగా ప్రయత్నించరు.నారా లోకేష్ కేవలం పరామర్శలకే పరిమితమయ్యారు. తండ్రి 70 పదుల వయసులో 36 గంటలు దీక్ష పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే కనీసం జిల్లాల్లో పర్యటించి పార్టీని గాడిన పెట్టేందుకు కూడా చినబాబు ట్రై చేయడం లేదు. పైగా నారా లోకేష్ పై పార్టీలో మరో భయం ఉంది. అభ్యర్థుల ఎంపిక కూడా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుందని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రులను కూడా లోకేష్ నిర్ణయిస్తారన్న టాక్ ఉంది.దీంతో చంద్రబాబు కు సీనియర్ నేతలు ఇప్పటికే చెప్పారు. లోకేష్ భాగస్వామ్యం తక్కువ ఉండేలా చూడాలని కోరారు. జిల్లాల్లో నారా లోకేష్ ను పర్యటింప చేసి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కొందరు కోరుతున్నారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎక్కువ సమయం హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. ఏపీకి చుట్టపుచూపుగా వచ్చి పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే పార్టీ నేతలు, క్యాడర్ లోనే నమ్మకాన్ని కల్గించుకోలేకపోతున్నారు
ఉత్తరాంధ్ర నుంచి సైకిల్ యాత్ర.  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైకిల్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఆయన ఉత్తరాంధ్ర నుంచే తన సైకిల్ యాత్రను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నియోజకవర్గాల మీదుగా కొనసాగే అవకాశాలున్నాయి. 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్దమవుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తాను యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. బహుశ ఆయన బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. చంద్రబాబు యాత్ర సీమ జిల్లాల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.దీంతో పాటు నారా లోకేష్ సయితం యాత్రకు సిద్ధమవుతున్నారు వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ యాత్ర ఉండే అవకాశాలున్నాయి. వీలయినన్ని ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేసేలా లోకేష్ యాత్ర రూట్ మ్యాప్ రూపొందుతుంది. రోజుకు ముప్ఫయి కిలోమీటర్ల మేరకు యాత్ర కొనసాగే అవకాశాలున్నాయి. ఈ యాత్ర కడప జిల్లాలో ముగిసేలా రూట్ మ్యాప్ ను రూపొందించినట్లు సమాచారం. మార్చి నెలలో ఈ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.నారా లోకేష్ పార్టీలో మరింత పట్టు సంపాదించుకునేందుకు ఈ యాత్ర ఉపయోగపడనుంది. లోకేష్ నాయకత్వంపై ఇప్పటికీ టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు నాయకత్వమే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు చంద్రబాబు మాత్రమే నాయకత్వం వహించినా, లోకేష్ కూడా పార్టీలో తన ప్రాధాన్యతను గుర్తించాలని సైకిల్ యాత్రను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా అనుసరిస్తున్న విధానాలను తన సైకిల్ యాత్ర ద్వారా ప్రజల ముందు ఉంచాలని నారా లోకేష్ డిసైడ్ అయ్యారు. పార్టీ విజయం సాధిస్తే తాను కూడా కీలక భూమిక పోషించానని చెప్పుకోవడానికి ఈ యాత్ర లోకేష్ కు ఉపకరిస్తుంది. అందుకోసమే ఆయన సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టనుంది. స్థానిక సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వివిధ సమస్యలతో తన యాత్ర ద్వారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లనున్నారు.

Related Posts