YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కర్నెకు ఎమ్మెల్సీ యోగం..?

కర్నెకు ఎమ్మెల్సీ యోగం..?

హైదరాబాద్, నవంబర్ 8,
పార్టీలో సీనియర్ నేత కర్నె ప్రభాకర్ కు ఈసారి ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్సు లేదు. అనేక సమీకరణాలు, కేసీఆర్ హామీలతో ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ ఇవ్వరనేది పార్టీ నుంచి విన్పిస్తున్న టాక్. సీనియర్ నేతగా కర్నె ప్రభాకర్ ను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశాలున్నాయని అంటున్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కర్నె ప్రభాకర్ పోటీ చేస్తారని, అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోరన్నది కొందరి వాదనగా విన్పిస్తుంది.కానీ కర్నె ప్రభాకర్ ను మునుగోడు నుంచి పోటీ చేయించే సాహసం చేయరన్నది కూడా విన్పిస్తుంది. మునుగోడు నియోజకవర్గం లో బలమైన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ నుంచి మునుగోడు నుంచి పాల్వాయి గోవర్థన్ రెడ్డి నాలుగుసార్లు గెలిచారు. సీపీఐ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐదుసార్లు మునుగోడు నుంచి విజయం సాధించాయి. టీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయనే మునుగోడు టీఆర్ఎస్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఈసారి కాంగ్రెస్, కమ్యునిస్టులు కలసి ఇక్కడ పోటీ చేస్తే వారికే అడ్వాంటేజీ ఉంటుంది. మరోవైపు కర్నె ప్రభాకర్ కు ఇక్కడ ప్రత్యేకంగా వర్గం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు రెడ్డి సామాజికవర్గం నేతలే గెలిచారు.మరోవైపు కర్నాటి విద్యాసాగర్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యాసాగర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనిషిగా పేరుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గాని, కర్నాటి విద్యాసాగర్ కు కాని టిక్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీంతో కర్నె ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీగానే మిగిలిపోవాల్సి ఉంటుందంటున్నారు. ఆయనకు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
రేసులో... చాలా మంది
టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇటీవల ఈనెల 9న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యుల్ విడుదల కావడంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరి పేర్లు ప్రతిపాదిస్తారో అనే ఉత్కంఠత పార్టీలో నెలకొంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. ఇక అదే రోజున ఫలితాలు కూడా విడుల అవుతాయి. అలాగే రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది టీఆర్ఎస్ పార్టీ.కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, రవీందర్ రావు, పాడి కౌషిక్ రెడ్డి, కోటి రెడ్డి, ఎల్ రమణలకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ప్రస్తుతం కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. తిరిగి మళ్లీ అవకాశం లభించిందిహుజూరాబాద్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌషిక్ రెడ్డికి అవకాశం లభించనుంది. గతంలో గవర్నర్ కోటాలో పాడి కౌషిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించనా.. వివిధ కారణాలతో గవర్నర్ ఆఫైల్ ను పెండింగ్ లో పెట్టారు. తాజాగా ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. మరో సీనియర్  నేత సిరికొండ మధుసూదనాచారి చాలా రోజులుగా కీలక పదవి కోసం చూస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి కీలక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సిరికొండకు కూడా ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది.

Related Posts