మన్యంలో పౌష్టికాహార లోపం, వైద్య సదుపాయాల కొరత మాతాశిశు మరణాలకు దారితీస్తోంది. తల్లీ బిడ్డల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో ఇవి సరిగా ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో పౌష్టికాహార లోపంతో గర్భిణులు, బాలింతలు పలు వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన రీతిలో పౌష్టికాహారం అందివ్వక పోవడంతో రక్తహీనతతో ఇక్కడి గర్భిణులు తల్లడిల్లుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ అయ్యే పౌష్టికాహారం పక్కదోవ పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంపచోడవరం ఆసుపత్రిలో సైతం మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందజేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు సక్రమంగా అందేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ సమస్యతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. దరమడుగులలో ఓ బాలింత ఇదే రీతిలో మరణించడం యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంలా నిలుస్తోంది.ఏజెన్సీలో మాతాశిశు సంరక్షణ కోసం పెద్ద మొత్తంలో నిధులు విడుదలవుతున్నాయి. దీనికి సంబంధించి పలు పథకాలు అమలులో ఉన్నాయి. కానీ వీటిపై పర్యవేక్షణ కొరవడుతోంది. గర్భిణులు, బాలింతలకు ఎలాంటి ఆహారం పెట్టాలి..? అనే విషయాన్ని గ్రామాల్లో సూచించే వారు కరవయ్యారు. దీంతో గిరిజన మహిళల్లో అవగాహన లేక రక్తహీనత బారిన పడుతున్నారు.