YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సర్కారుకు కేంద్రంలోని మోడీ సర్కారు భారీ షాక్

ఏపీ సర్కారుకు కేంద్రంలోని మోడీ సర్కారు భారీ షాక్

న్యూ ఢిల్లీ నవంబర్ 8
ఏపీ సర్కారుకు కేంద్రంలోని మోడీ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నుంచి తెచ్చుకున్న అప్పును సకాలంలో తీర్చకపోవటంతో కేంద్రం ఊహించని రీతిలో నిర్ణయాన్ని తీసుకుంది. సకాలంలో అప్పు చెల్లించని ఏపీ జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరుస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా ఏపీ ప్రభుత్వం నెత్తి మీద పిడుగు వేసింది. ఏపీ జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చటమంటే.. తర్వాతి అడుగులో ప్రైవేటీకరణ చేయటమే అవుతుంది. ఇదే జరిగితే ఏపీకి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే అప్పు నిప్పుతో సమానమంటుంటారు. అప్పు చేయటం అన్నది డెవల్ మెంట్లో భాగమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి అధినేతలు తమకు తగ్గట్లుగా అప్పుడప్పుడు కొత్త తరహాగా సూత్రీకరించొచ్చు కానీ.. అప్పుతో ఎప్పటికైనా తిప్పలే. రెండు చేతులా సంపాదిస్తున్న వేళ.. చేసే అప్పుల్ని తీర్చటం పెద్ద సమస్య కాదు. కానీ.. చేసిన అప్పునకు.. వాటిని తీర్చేందుకు చేతిలోకి వచ్చే ఆదాయానికి మధ్య అంతరం తగ్గే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతుంటాయి.ఇప్పుడు ఏపీ సర్కారు ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తినటం తెలిసిందే. కల్పతరువు లాంటి హైదరాబాద్ మహానగరం తెలంగాణ బొక్కసానికి వరంగా మారితే.. ఏపీకి శాపంగా పరిణమించింది. దీనికి తోడు విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బాబు సర్కారు అప్పులు చేయగా.. అంతకు మించి అన్న రీతిలో జగన్ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోంది. అప్పు చేసి పప్పుకూడు అన్న చందంగా.. సంక్షేమ పథకాల కోసం.. ఉచితాల కోసం అప్పుగా తెచ్చిన మొత్తాన్ని వినియోగించటం ఇప్పుడో సమస్యగా మారింది. పలువురు సీనియర్ నేతలు.. ఆర్థిక రంగానికి చెందిన వారు ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు తగ్గట్లే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అప్పుల భారం పెరుగుతూనే వస్తోంది. బాబు ప్రభుత్వం అప్పులు చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు రెట్టింపు అప్పు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు కూడా పెట్టేస్తున్నారు. ఏపీ విద్యుత్ ఉత్పత్తి కార్పొరేషన్.. సింపుల్ గా చెప్పాలంటే ఏపీ జెన్ కో కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రామీన విద్యుదీకరణ కార్పొరేషన్ నుంచి గతంలోఅప్పు తీసుకుంది. వాటిని చెల్లించాల్సిన సమయానికి చెల్లించలేదు. గడిచిన మూడు నెలలుగా గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ అప్పలు తీర్చటం లేదు. పలుమార్లు గుర్తు చేసినా పట్టనట్లే వ్యవహరిస్తోంది. దీనిపై తాజాగా కేంద్రం కన్నెర్ర చేసింది. అప్పు తీర్చాల్సిన వాయిదా గడువు పూర్తై తర్వాత మరో 90 రోజులు కూడా గడిచిపోవటం.. ఏపీ సర్కారు దీనిపై ఎలాంటి స్పందన లేకపోవటంతో కేంద్రం ఏపీ జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చింది. దీంతో.. డిఫాల్టర్ గా మారిన ఈ సంస్థకు అప్పు పుట్టని పరిస్థితి. దీంతో.. ఏపీ అధికారులు ఢిల్లీకి పరుగులు తీశారు.జెన్ కోను కేంద్రం నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేర్చారన్న విషయాన్ని తెలుసుకున్నంతనే స్పందించిన అధికారులు.. కేంద్రం వద్దకు వెళ్లి లాబీయింగ్ చేసే ప్రయత్నాలుచేస్తున్నారు. ఇప్పటివరకు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ నుంచి ఏపీ సర్కారు రూ.9వేల కోట్ల రుణాల్ని తీసుకుంది. ఈ మొత్తాన్ని తాము చెల్లిస్తామని.. తెలంగాణ నుంచి తమకు రావాల్సిన రూ.5వేల కోట్లను ఇప్పించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మరి.. దీనిపై కేంద్రం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.

Related Posts