YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే

కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే

హైదరాబాద్, నవంబర్ 8,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంపై బురద జల్లేందుకు కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు.హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఏడేళ్ల పాలనతో కేసీఆర్ రైతులకు చేసిందేమీ లేదని, ఆయన అసమర్థ పాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సంజయ్ ఆరోపించారు. 62లక్షల ఎకరాల్లో వరి వేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, ఇది పెద్ద స్కామ్‌ అని తెలుస్తోందన్నారు. వరి వేయొద్దని ఓసారి, పత్తి కొనొద్దని మరోసారి విభిన్న ప్రకటనలు చేస్తూ ప్రభుత్వం రైతులను ఆగమాగం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2015లోనే వ్యాట్ 4శాతం పెంచిందని, ప్రస్తుతం దేశంలో వ్యాట్ అధికంగా వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తానని కేంద్రం చెబితే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకున్న మాట వాస్తవం కాదా? అని బండి సంజయ్ నిలదీశారు. దేశంలో 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే కేసీఆర్ సర్కార్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఎదురుచూసిందని, కానీ కేంద్రంపై దుమ్మె్త్తిపోయడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు.వ్యవసాయ చట్టాల విషయంలో ఏదో చేస్తా అంటూ ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. అక్కడ ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. చివరకు సుప్రీంకోర్టే కేసును ఆపేసిందని, ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లి ఇండియా గేట్ వద్ద గడ్డి పీకడం తప్ప చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులూ ప్రగల్భాలు తప్ప ఏమీ చేయని కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తే జనాలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. కేసీఆర్ అబద్ధాలకు కూడా ఓ శాఖ పెట్టి దాన్ని అల్లుడికి అప్పగిస్తే బాగుటుందని సంజయ్ ఎద్దేవా చేశారు.60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొంటామని 31.08.2021 రోజున కేంద్రం లేఖ రాసింది. ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తానన్నారు.. ఎక్కడ చేశారని ఎద్దేవ చేశారు. రైతుచట్టాలపై ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?.. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా? కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని కొత్త చట్టంలో ఉందా? గతంలో ఎగుమతి చేయాలన్న కేసీఆర్ ఇప్పుడు వద్దంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం 32-35 శాతం వ్యాట్ పెంచారు. లీటర్‌ పెట్రోల్‌పై తెలంగాణకు రూ.28 వస్తున్నాయని.. కేంద్రానికి వచ్చే రూ.27లోను రాష్ట్రానికి రూ.12 వస్తున్నాయని వివరణ ఇచ్చారు. వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో తెలంగాణ రెండోదన్నారు బండి సంజయ్. 24 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినప్పుడు తెలంగాణలో ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు రూ.2,52,908 కోట్లు ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 40 వేల కోట్లే వచ్చాయని అబద్దాలు చెప్తోందని బండి సంజయ్ దుయ్యబట్టారు.జాతీయ రహదారుల కోసం రూ.40 వేల కోట్లు మంజూరు చేసింది కేంద్రం. ఇప్పటికే కేంద్రం రూ.21 వేల కోట్లు ఇచ్చింది. KRMB, GRMB ఏంటన్నప్పుడు.. మీటింగ్‌కు ఎందుకు హాజరయ్యారని అన్నారు. 575 టీఎంసీలు రావల్సి ఉండగా.. 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Related Posts