YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి తొలి ఎలక్ట్రిక్ బస్సులు

ఏపీకి తొలి ఎలక్ట్రిక్ బస్సులు

తిరుపతి, నవంబర్ 9,
దేశంలో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేసిన, ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రగామి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్ (ఒలెక్ట్రా), ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల కన్సార్షియం ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల ఆర్డర్‌ను పొందింది. ఆ ఆర్డర్‌ ప్రకారం 100 ఎలక్ట్రిక్‌ బస్సులను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) అపెక్స్ మోడల్ ప్రాతిపదికన అందించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు 12 సంవత్సరాలు అమలులో ఉంటుందని దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్ సంస్థ.. ఎంఈఐఎల్ గ్రూపు, ఈవీ ట్రాన్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి కాలుష్య రహిత, శబ్ద రహిత, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణాలు చేయాలన్న చిరకాల కల దీంతో నెరవేరబోతోంది. కేంద్ర ప్రభుత్వం, ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాలతో దేశీయ ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు 100 ఎలక్ట్రిక్‌ బస్సుల ఆర్డర్‌ లభించింది. ఈ కాంట్రాక్ట్ మొత్తం విలువ దాదాపు రూ. 140 కోట్లు. వచ్చే 12 నెలల కాలంలో ఈ బస్సులను డెలివరీ చేయాల్సి ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. బస్సులు ఆర్టీసీకి అందిన వెంటనే తొలుత ఈ బస్సులను తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తారు. ఇందులో 50 బస్సులను తిరుమల – తిరుపతి ఘాట్ రోడ్డులోనూ, మరో 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్‌సిటీ సర్వీసులుగా నడపనున్నారు. కాంట్రాక్టు కాలంలో బస్సులను మెయింటెనెన్స్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ చేయనుంది. ఈ కొత్త ఆర్డర్‌తో ఒలెక్ట్రా ఆర్డర్‌ బుక్‌ దాదాపుగా 1,450 బస్సులకు చేరుకుంది.ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవి ప్రదీప్‌ మాట్లాడుతూ, శ్రీ వేంకశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల తిరుపతి ఘాట్‌ రోడ్డులో ప్రయాణించే భక్తులకు సేవలందించే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్‌ బస్సులను ఆపరేట్‌ చేసే అవకాశం కలిగినందుకు గర్వంగా ఉందన్నారు. శేషాచల అడవులు, తిరుమల ఘాట్‌ రోడ్డుల సంపన్న పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ బస్సులు తోడ్పడతాయన్నారు. ఎఫీషియెంట్‌ ఎలక్ట్రిక్‌ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలకు ఒలెక్ట్రా కట్టుబడి ఉంది. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే మా ఈ వంద బస్సులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవంతం అవుతాయన్న నమ్మకం ఉందని ప్రదీప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎలక్ట్రిక్‌ బస్సులు మన్నికను, పనితీరును ఇప్పటికే నిరూపించుకున్నాయి. ముంబై, పూ‎ణే, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌, సూరత్‌, డెహ్రాడూన్‌, సిల్వాస, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళలో విజయవంతంగా మా బస్సులు నడుస్తున్నాయి” అని ఆయన తెలిపారు.

Related Posts