YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆమీ, తుమీకి రెడీ అవుతున్న జగన్

ఆమీ, తుమీకి రెడీ  అవుతున్న జగన్

విజయవాడ, నవంబర్ 9,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకునేందుకే సిద్ధమయినట్లు కన్పిస్తుంది. ఇద్దరి మధ్య సయోధ్యకు పెట్రోలు మంట రాజేసినట్లే కనపడుతుంది. బీజేపీ రాష్ట్ర పార్టీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడేలా పెట్రోలు రేట్లు పెరిగిన తీరు, దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం సెస్సు వేయడం, ఎంత పెంచిందీ? ఎంత తగ్గించిందీ? తదితర విషయాలను ప్రజలకు చెప్పడం ద్వారా బీజేపీతో కయ్యానికి సిద్ధమయినట్లే కన్పిస్తుంది.నిజమే పెట్రోలు ధరలు లీటరకు 40 రూపాయలకు పెంచి ఐదు రూపయాలకు తగ్గించి బిల్డప్ లు ఇవ్వడం బీజపీకి మామూలే. పైగా అసలే కరోనాతో అతలాకుతలమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ పెట్రో భారం మరింత ఇబ్బంది తెచ్చిెపెట్టనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే పెట్రోలు ధరలు తగ్గించారన్నది వాస్తవం. ఆ ఎన్నికల అనంతరం మళ్లీ పెరుగుతాయన్నది కూడా కాదనలేదని నిజం. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ జగన్ పై ఎదురుదాడికి దిగడంతో జగన్ వాస్తవ విషయాలను ప్రకటన రూపంలో చెప్పాల్సి వచ్చింది.ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు సయితం గతంలో పెట్రోలు ఎప్పుడు పెరిగినా బీజేపీని ఒక్క మాట అనలేదు. కేంద్ర ప్రభుత్వం నలభై రూపాయలను పెంచినా ఏమీ అనని చంద్రబాబు ఏపీలో జగన్ ప్రభుత్వం రూపాయి పెంచిన వెంటనే అల్లరి చేయడానికి రెడీ అయిపోయారు. రోజూ పెట్రోలు ధరలు పెరుగుతున్నా ఏమీ బీజేపీని అనలేదు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల మాదిరిగా ఏపీలోనూ పెట్రోలుపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జగన్ తాను పెట్రోలు ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించేది లేదని చెప్పకనే చెప్పినట్లయింది. నలభై రూపాయల వరకూ పెంచిన బీజేపీని ఏమీ అనకుండా రూపాయి పెంచిన తమపై విమర్శలు చేయడమేంటని వైసీపీ నేతలు సయితం అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలను ఇరుకున పెట్టేందుకు ఈ విధమైన డ్రామా ఆడుతుందని గ్రహించిన జగన్ తాను చెప్పదలచుకున్నది సూటిగా ప్రకటన రూపంలో చెప్పినట్లయింది. జగన్ కు, బీజేపీకి మధ్య ఇప్పటి వరకూ ఉన్న మైత్రిపై పెట్రోలు మంట పెట్టిందనే చెప్పాలి.

Related Posts