విజయవాడ, నవంబర్ 9,
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహం అమలు చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసు…పరిస్తితులకు తగ్గట్టుగా రాజకీయాన్ని మార్చేస్తారు. అలా రాజకీయం మార్చేసి సక్సెస్ అవుతారు. కానీ ఈ మధ్య ఏంటో కేసీఆర్ రాజకీయాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ని ఓడించడానికి కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు…ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారనేది..లాగు వేసుకునే బుడ్డోడుకు కూడా తెలుసుకానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వర్కౌట్ కాలేదు….హుజూరాబాద్‌లో ఈటల గెలుపుని ఆపలేకపోయారు. అయితే ఉపఎన్నిక ముందు కేసీఆర్ ఒక స్ట్రాటజీ వేశారు..అది అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. అంటే తానే తోపు సీఎం అన్నట్లుగా డప్పు కొట్టుకున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ…తన పాలనని చూసి ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ముగ్దులవుతున్నారని, తమకు కూడా తెలంగాణలో అమలయ్యే పథకాలు కావాలని కోరుకుంటున్నారని కేసీఆర్ సెలవిచ్చారు.అసలు తెలంగాణకు బోర్డర్‌లో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక ప్రజలు..తెలంగాణకు వచ్చేస్తామని, తమని తెలంగాణలో కలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారని మాట్లాడారు. ఇదే కాదు ఏపీ ప్రజలైతే…అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. పార్టీ పెడితే చాలు తామే గెలిపించేసుకుంటామని ఏపీ ప్రజలు చెబుతున్నారని కేసీఆర్ ఎడాపెడా డప్పు కొట్టేసుకున్నారు.ఇంకేముంది ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టేస్తున్నారని హడావిడి మొదలైపోయింది. అయితే ఇదంతా డప్పు అని జనాలకు అర్ధమైంది…అంటే తన పాలన సూపర్ అని, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని, కాబట్టి తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావించాలని అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. పరోక్షంగా హుజూరాబాద్ ప్రజలని ఆకర్షించడానికి కేసీఆర్…బిల్డప్ బాబాయ్ అవతారం ఎత్తారు. కానీ అదంతా బిల్డప్ అని జనాలకు అర్ధమైంది. అందుకే హుజూరాబాద్ ప్రజలు చిత్తుగా ఓడించి పక్కనబెట్టేశారు. ఏదో ఒకప్పుడు ఈ బిల్డప్‌లు వర్కౌట్ అయ్యాయి గానీ, ఇప్పుడు వర్కౌట్ కావని రుజువు చేశారు.