YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కర్ణాటక కాంగ్రెస్ కు కలిసొస్తున్న కాలం

 కర్ణాటక కాంగ్రెస్ కు కలిసొస్తున్న కాలం

బెంగళూర్, నవంబర్ 10,
కర్ణాటకలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. బీజేపీ లో నెలకొన్న విభేదాలను, ముఖ్యమంత్రి మార్పిడి వంటి అంశాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయి. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికలలో ఒక దానిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది బీజేపీ పాలన పై అసంతృప్తికి అద్దం పడుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. 2023లో కర్ణాటక రాష్ట్రానికి శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ప్రయత్నిస్తుందికర్ణాటకలో బీజేపీ తన చేటును  తానే కొని తెచ్చుకున్నట్లయింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్ప ను తప్పించిన తర్వాత బలమైన లింగాయత్ సామాజికవర్గం బీజేపీపై ఆగ్రహంగా ఉందంటున్నారు. బసవరాజు బొమ్మై అదే సామాజికవర్గం నేత అయినా దానిని పరిగణనలోకి  తీసుకోవడం లేదు. యడ్యూరప్పను తప్పించి తమ సామాజికవర్గానికి అన్యాయం చేసిందన్న అభిప్రాయం లింగాయత్ లలో వ్యక్తమవుతోంది. ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా మారనుంది.ఇటీవల హంగల్, సిండగి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు  జరిగితే హంగల్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలో ఉండటంతో బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్ ఒక నియోజకవర్గంలో ఓటమి పాలయినా రెండు నియోజకవర్గాల్లో సత్తా చాటగలిగింది. కాంగ్రెస్  అధ్యక్షుడిగా డీకే శివకుమార్ నియామకం తర్వాత రాష్ట్రంలో మరింత పుంజుకుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.బీజేపీ లో నెలకొన్న  విభేదాలను ఎక్కడికక్కడ తమకు అనుకూలంగా మలచుకుంటూ డీకే శివకుమార్ వెళుతున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. బీజేపీ పరిస్థితి రాను రాను దయనీయంగా తయారయిందని అంటున్నారు. 
కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యం కూడా ఈ అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చినట్లే కన్పిస్తున్నాయి 

Related Posts