YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కుప్పంలో ఉద్రిక్తత…టీడీపీ నేతల ఆరెస్టు

కుప్పంలో ఉద్రిక్తత…టీడీపీ నేతల ఆరెస్టు

కుప్పం
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు సమీపిస్తుండడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.  మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్నాథ్ రెడ్డితోపాటు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేశారు. బీసీఎన్ గెస్ట్ హౌజ్ ల వున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదని.. 14వ వార్డును ఫోర్జరీ సంతకలతో ఏకగ్రీవం చేసుకున్నారని.. టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ నామినేషన్ను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నట్లు చూపించారని పార్టీ నేతల ఆరోపణ. ఈ మేరకు 19 మంది టీడీపీ నేతల మీద కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఇద్దరినీ మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 143, 147,353, 427,149 సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉదయం నుంచి సైలెంట్ గా ఉండి.. మంగళవారం రాత్రి టీడీపీ నేతలు బస చేస్తున్న హోటల్ వద్దకు వెళ్లి అరెస్టు చేశారు.   ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులకు 41ఏ నోటీసులు ఇచ్చి, అరెస్టు చేసి వారి సొంత ప్రాంతాలకు తరలించారు. 

Related Posts