YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

18 నుంచి అసెంబ్లీ

18 నుంచి అసెంబ్లీ

నవంబర్ 10,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇక అంతకు మించి ఆలస్యం చేయడానికి కూడా లేదు. అలా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఒక సారి అసెంబ్లీ తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ వర్షా కాల సమావేశాలను నిర్వహించలేదు. ప్రతీ సారి అసెంబ్లీ సమావేశాలను తప్పనిసరి అన్నట్లుగానే నిర్వహిస్తోంది. గత మార్చిలో బడ్జెట్ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసుకున్నారు. చివరికి మే 20వ తేదీన ఒక్కటంటే ఒక్క రోజు మాత్రమే సభను నిర్వహించి బడ్జెట్ పెట్టుకుని ఆమోదించుకుని వాయిదా వేశారు. ఆ ఒక్క రోజు సమావేశానికి టీడీపీ హాజరు కాలేదు. నవంబర్ 20వ తేదీకి ఆరు నెలలుపూర్తయిపోతుంది. అంటే ఖచ్చితంగా 20వ తేదీ కంటే ముందే అసెంబ్లీని సమావేశపర్చాలి. అందుకే కాస్త సేఫ్ గా ఉంటుందని ఒక రోజు ముందుగా 18వ తేదీ నుంచి అసెంబ్లీని పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నాలుగైదు రోజులు నిర్వహించి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు పదిహేడో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగడం.. చర్చల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యంలో కీలకం. అయితే రాను రాను అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి అధికార పార్టీకి ఆసక్తి తగ్గిపోతోంది. ఒక వేళ నిర్వహించినా ప్రతిపక్షాన్ని కనిపించకుండా.. వినిపించకుండా చేస్తున్నారు.
అప్పు కోసం ప్రయత్నం
మరో వైపు ర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చే నెలకు ఖర్చులకు సర్దుబాటు చేయడానికి ఇప్పటి నుండి ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు రోజుల నుండి ఢిల్లీలో మకాం వేసి అదనపు అప్పులకు పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ వరకూ ఆర్బీఐ వద్ద బాండ్ల వేలంద్వారా తీసుకోగలిగిన రుణం కేవలం రూ. 150 కోట్లు మాత్రమేఉంది. కానీ రెండు నెలలు గడవాలంటే మరో రూ. పదివేల కోట్ల అప్పు కావాలి. తాము అన్ని సంస్కరణలు అమలు చేస్తున్నామని అప్పు తీసుకునేందుకు పరిమితి పెంచాలని కోరుతూ బుగ్గన ఢిల్లీలో వాలిపోయారు. ఆయన వెంట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ కూడా ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో అదే పనిగా చర్చలు జరుపుతున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశమయ్యారు. ఈ నెలలో ఇప్పటికే కొన్ని అప్పులు తిరిగి చెల్లించడానికి అవసరమైన నిధులు లేవు. ఈ నెలలో అప్పులు పుట్టకపోతే వచ్చే నెలలో జీతాలు, పెన్షన్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. బ్యాంకుల నుంచి తీసుకునే విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆర్బీఐ బాండ్ల ద్వారా నమ్మకంగా అప్పులు వస్తాయి. అందుకే అదనపు రుణం పర్మిషన్ కోసం బుగ్గన గతంలో చేసినట్లుగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రం ఏపీ ప్రభుత్వం పట్ల మొదటి నుంచి సానుకూలంగానే ఉంది. అప్పులపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అదనపు రుణం కోసం పర్మిషన్ ఇస్తారన్న నమ్మకంతోనే ఉన్నారు.

Related Posts