YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోళ్ల పరిశ్రమకు గడ్డు రోజులు

కోళ్ల పరిశ్రమకు గడ్డు రోజులు

చిత్తూరు

కోళ్ళ పరిశ్రమకు గుడ్డు రోజులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా చికెన్‌ ధర భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. పక్షం రోజుల క్రితం కిలో బాయిలర్‌ కోడి మాంసం ధర రూ.160, స్కిన్‌లెస్‌ రూ.180గా ఉంది. ప్రస్తుతం ధర భారీగా పెరిగి మాంసం ధర రూ.200, స్కిన్‌లెస్‌ రూ.220కు చేరుకుంది. కోళ్ల సరఫరాలో భారీ వ్యత్యాసం కారణంగా ధర పెరుగుదల అసాధారణంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజులలోనే మాంసం ప్రియులు చికెన్‌ దుకాణాల వద్ద వరుస కడుతుంటారు. ఇక ఆదివారం వస్తే కిటకిటలాడుతారు. కాగా ఈ వారం ధర పెరుగుదల విక్రయాలపై భారీగా ప్రభావం చూపిందని దుకాణదారులు వాపోతున్నారు. ధర అసాధారణ పెరుగుదల కారణంగా వినియోగదారులే కాకుండా దుకాణదారులు సైతం నష్టపోతున్నారు.

వేసవి దెబ్బకోడి మాంసం ధరల్లో భారీ పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో కోళ్ల పెంపకం చేపట్టకపోవడం, వేడి కారణంగా కోడి బరువు పెరుగుదలలో వ్యత్యాసం ఉండటం, తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులకు కోళ్లు మృత్యువాత పడుతుండటం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. వివాహాది శుభకార్యాలు భారీగా ఉండటం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. వేసవిలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించేవారు ఉంటారు. ఇటువంటి చోట్ల భోజనాల్లో మటన్‌తో పాటు కోడి మాంసం కూడా పెడుతుంటారు. సాధారణంగా కిలో బాయిలర్‌ కోడి హోల్‌సేల్‌ ధర రూ.90గా ఉంటుంది. ప్రస్తుత వాతావరణ ప్రభావంతో ఒక్కసారిగా రూ.105లకు పెరిగింది. అలాగే నాటుకోడి ధర కిలో రూ.270లకు పెరిగింది. అంటే కిలో నాటుకోడి మాంసం ధర రూ.400లకు చేరినట్లయింది. సరఫరాలో తేడా కారణంగా బాయిలర్‌, నాటు కోళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కోళ్లపరిశ్రమ దిగ్గజం సుందరనాయుడు బాలాజీ హెచరీస్‌తో పాటు, వెంకటేశ్వరి హెచరీస్‌ చిత్తూరులో జిల్లాలోనే ఉన్నాయి. ఈ హెచరీస్‌లో పొదిగిన కోడిపిల్లలు దేశంలోని వివిధ కోళ్లఫారాల్లో పెంపకానికి తరలిస్తుంటారు. కోళ్లపరిశ్రమకు చిత్తూరు జిల్లాలో అనుకూల వాతావరణం ఉందని కోళ్లపరిశ్రమ పెద్దలతో పాటు నేషనల్‌ ఎగ్‌కోఆర్డినేషన్‌ నాయకులు పలు సందర్భాల్లో చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో మండిపోతున్న ఎండలకు కోళ్లఫారాల్లో కోళ్ళు చనిపోతున్నాయని కోళ్లరైతులు చెబుతున్నారు. చిత్తూరు నియోజకవర్గంలోని చిత్తూరు రూరల్‌, గుడిపాల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లఫారాలు ఉన్నాయి. నియోజవర్గ పరిధిలో సుమారుగా 90 నుంచి 115 కోళ్లఫారాలు ఉన్నట్లు కొళ్లరైతులు సమాఖ్య నాయకులు చెబుతున్నారు. కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసుకున్న రైతులకు చికెన్‌ కంపెనీలు కోడి పిల్లలను సరఫరా చేస్తున్నారు. ఇక్కడి ఫారాల్లో 45 రోజుల పాటు పెంచాక వీటిని చికెన్‌ కంపెనీలు తీసుకొని మార్కెట్‌కు తరలిస్తుంటాయి. అయితే 30 నుంచి 40 రోజుల పాటు పెంచాక ఎండతాపానికి తట్టుకోలేక చనిపోతున్న కోళ్లను ఫారం నిర్వహకులు లెక్కలోకి తీసుకొని నష్టాలు వస్తున్నాయంటూ ఫారాలను నిర్వహిస్తున్న కోళ్ల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులో కోత విధిస్తున్నారు. ఎండాకాలంలో చికెన్‌ ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి ప్రస్తుతం కిలో చికెన్‌ రూ. 180 ఉంటోంది. ఈ నెల చివరకు రూ. 200 చేరే అవకాశం ఉన్నట్లు చికెన్‌ సెంటర్‌ నిర్వహకులు చెబుతున్నారు. ఎండ వేడికి కోళ్ల పెంపకం తగ్గిందంటున్నారు. జూన్‌లో మరింతగా ఎండలు ముదిరితే చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. మొన్నటివరకు ధర తక్కువగా ఉండడం వల్ల చిన్న రైతులందరి వద్ద ఉన్న కోళ్లన్నీ దాదాపు తగ్గుముఖం పట్టాయి. దీంతో గడిచిన వారం రోజుల్లో ఇంటిగ్రేటెడ్‌ కంపెనీలు సిండికేట్‌ అయ్యాయి. ఇదే అదనుగా కంపెనీ ధరలు పెంచేశాయి. ధరలు పెంచడం వల్ల వినియోగదారులకు నష్టం తప్ప కంపెనీలకు కాదు. కంపెనీలు మందులు, మేత అన్ని సొంతగానే తయారు చేసుకుంటున్నాయి. గతంలో రూ 20ఉన్న కోడి పిల్ల ధర ప్రస్తుతం రూ 30నుంచి 40వరకు ఎగబాకింది. దీనంతటికి కారణం చిన్న రైతులను లేకుండా చేయాలని పెద్ద కంపెనీలు చేస్తున్న ప్రయత్నంలో భాగమని రైతులు వాపోపోతన్నారు.కోళ్లఫారం ఏర్పాటు చేసుకున్న రైతులకు కంపెనీలు కోడిపిల్లలు దాణా, కోళ్లకు వేసే మందులు మాత్రమే సరఫరా చేస్తాయి. ఫారం నిర్వహన కోసం విద్యుత్‌, నీళ్లు ఏర్పాటు చేసుకొని వాటిని సంరక్షించాలి. ఇలా పెంచిన కోళ్లను 45 రోజుల తరువాత కోడి పిల్లల్ని సరఫర చేసిన సదరు కంపెనీ నిర్వహకులు కేజికి రూ. 2 నుంచి రూ. 3 ఇచ్చి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఉష్ణోగ్రత పెరిగి ఎండవేడి పెరగడంతో ఫారాల నిర్వహణ ఖర్చులు పెరిగాయని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు ఇస్తున్న కిలోకు రెండు, మూడు రూపాయలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదంటున్నారు.

Related Posts