YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ధాన్యం కొనుగోలు విషయంలో కిషన్‌ రెడ్డి, బండి పొంతన లేని వాదనలు

ధాన్యం కొనుగోలు విషయంలో కిషన్‌ రెడ్డి, బండి పొంతన లేని వాదనలు

కరీంనగర్‌ నవంబర్ 10
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి చెప్పేదానికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పేదానికి పొంతన లేదని మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌తో కలిసి మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. రైతుల ను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నదని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను కరీంనగర్‌ కలెక్టరేట్‌తోపాటు జిల్లాలోని కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తామన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ధర్నా కొనసాగుతుందని వెల్లడించారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఇప్పుడిప్పుడే రైతులు బాగుపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు, ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం పంటలను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. వంద కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇవ్వాలని ఎఫ్‌సీఐ నిబంధన పెట్టిందని, కేంద్రం రైతుల మీద లాభాన్ని చూడొద్దన్నారు. యాసంగిలో ధాన్యం నూక ఎక్కువ వస్తుందని, గిట్టుబాటు కాదని వెల్లడించారు. తాను, మంత్రి కేటీఆర్‌ ధాన్యం కొనాలని కేంద్ర మంత్రిని అడిగితే నిరాకరించారని తెలిపారు.బండి సంజయ్‌ వరి వెయ్యాలని చెప్తున్నాడని, కేంద్ర ప్రభుత్వం తాము కొనేది లేదని చెప్తున్నదని విమర్శించారు. పంజాబ్‌లో ధాన్యాన్ని కొంటున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు. ఎల్లుండి కేంద్ర మంత్రి ఇంటిముందు బీజేపీ నేతలు ధర్నా చేయాలన్నారు. బియ్యం ఎగుమతి చేసే అధికారం రాష్ట్రానికి లేదన్నారు.

Related Posts