విజయవాడ, నవంబర్ 11,
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. సమావేశంలో భాగంగా రాష్ట్రపతితో ఆయన సమావేశమవుతారు. అయితే ప్రెసిడెంట్ సదస్సు కోసమే ఏపీ గవర్నర్ ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. ఏపీ పరిణామాలపై కేంద్రానికి గవర్నర్ హరిచందన్ నివేదిక ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. వారం వారం అప్పులు చేస్తేనే కాని పాలన సాగే అవకాశాలు కన్పించడం లేదు. ఏపీలో పెరిగిపోతున్న అప్పుల విషయం మీద జాతీయ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు చాలా సార్లు ఫిర్యాదు చేశాయి. రూల్స్ కు విరుద్ధంగా తీసుకువస్తున్న అప్పులను కట్టడి చేయాలని కోరాయి. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ తగ్గంపుపైనా రాజకీయ రచ్చ సాగుతోంది.ఇక ఇటీవల టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు పలు జిల్లా పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లి మరీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి మరీ జగన్ మీద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అశాంతి పెరుగుతోందని కాబట్టి ఆర్టికల్ 356ను పెట్టి ఏపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇటీవల మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్ష చేసినా.. గంటా వచ్చి సంఘీభావం తెలపలేదు. గెలిచినప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ పంచన చేరేందుకు ఉబలాటపడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం తెర మీదకు రాగానే.. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నానంటూ డ్రామా క్రియేట్ చేసి.. వైసీపీలో చేరిపోవాలని భావించారు. కానీ, మంత్రి అవంతి శ్రీనివాస్.. గంటా శ్రీనివాస్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పటి గురుశిష్యులు ఇప్పుడు బద్ద శత్రువులు. విశాఖలో గంటా గంట మోగకుండా.. సిటీలో, పార్టీలో ఆయనకు స్పేస్ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో.. ఇటు టీడీపీలో లేకుండా.. అటు వైసీపీలో చేరలేకుండా.. గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు రెంటికీ చెడ్డ రేవడిగా మారిందంటున్నారు.