YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హరీష్ రావు కు అచ్చి రాని వైద్యశాఖ

హరీష్ రావు కు అచ్చి రాని వైద్యశాఖ

హైదరాబాద్, నవంబర్ 11,
తెలంగాణ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేశారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖను ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. మంత్రివర్గ శాఖలో మార్పులపై ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఇకపై ఆర్థికశాఖతో పాటు వైద్య శాఖను చూడబోతున్నారు హరీష్ రావు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారింది.హరీష్ రావుకు ఆరోగ్య శాఖ అప్పగించడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. హరీష్ రావును కేసీఆర్ టార్గెట్ చేశారని, అందుకే అచ్చిరాని ఆరోగ్య శాఖను కేటాయించారని కొందరు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో ఆరోగ్య శాఖ గండంగా మారిందని, ఆ శాఖ నిర్వహించిన వారు తర్వాత తమ పదవిని కోల్పోయారని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి హెల్త్ మినిస్టర్ గా తాటికొండ రాజయ్య పని చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ వైద్యశాఖను చూశారు. అయితే కొన్ని రోజుకే అవమానకరమైన రీతిలో ఆయన తన పదవిని కోల్పోయారు. రాజయ్య తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మారెడ్డికి వైద్యశాఖ కట్టబెట్టారు. అయితే 2018లో లక్ష్మారెడ్డి గెలిచినా ఆయన కేబినెట్ బెర్త్ దక్కలేదు. 2018లో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకా చాలా రోజుల వరకు వైద్యశాఖ ఖాళీగా ఉంది. తర్వాత ఈటల రాజేందర్ కు వైద్యశాఖను కేటాయించారు కేసీఆర్. అయితే రెండేండ్లు మాత్రం రాజేందర్ వైద్యశాఖను నిర్వహించారు. గత జూలైలో భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు ముఖ్యమంత్రి. అప్పటి నుంచి వైద్యశాఖ ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు వైద్యశాఖను నిర్వహించిన వారంతా తిరిగి పదవి దక్కించుకోలేకపోయారు. దీంతో తెలంగాణలో వైద్యశాఖ ఐరెన్ లెగ్ శాఖ మారిందనే చర్చ ఉంది. 2014 నుంచి జరిగిన పరిణామాల ఆధారంగానే హరీష్ రావు విషయంలో చాలా మంది ఇలా కామెంట్లు చేస్తున్నారు. హరీష్ రావుకు కావాలనే అచ్చిరాని ఆరోగ్యశాఖను ఇచ్చారంటున్నారు. వైద్యశాఖను తీసుకుంటే.. ఇక వచ్చే ఎన్నికల తర్వాత హరీష్ రావు పదవి కోల్పోవడం ఖాయమని కొందరు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ తర్వాత కేసీఆర్ టార్గెట్ హరీష్ రావేననే చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. తాజా పరిణామంతో హరీష్ రావు రాజకీయ జీవితాన్ని ఖతం చేసేందుకే వైద్యశాఖను కేసీఆర్ కేటాయించారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.  

Related Posts