మైనర్ బాలికలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మానవత్వం మంటగలుస్తున్నాయి. మృగాళ్లు మారడంలేదు. తాజాగా
హైదరాబాద్ కాప్రా సర్కిల్ జమ్మిగడ్డ శివసాయి నగర్ కాలనీలో దారుణం జరిగింది. అభం,శుభం ఎరుగని చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎదిరింట్లో ఉండే 11 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడబోయాడు. అదృష్టవశాత్తూ స్థానికులు గమనించి బాలికను కాపాడారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డలో దారుణం, శివసాయి నగర్ కాలనీలో నివాసముండే జహంగీర్(35) సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిముందు ఉండే 11 సంవత్సరాల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి తన ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన స్థానికులు బాలికను రక్షించి నిందితుడికి దేహశుద్ది చేసి జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు.