దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక లో బీజేపీ సభ జరిగింది. ఈటీవల హూజూరాబాద్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడారు. మెదక్ జిల్లా తో నాకు అనుబంధం ఉంది. మే రెండు నాడు చిల్లర రాజకీయం తో నన్ను భయటకు పంపిండ్రు కెసిఆర్. నన్ను భయటకు పంపినప్పుడే నేను బానిసత్వం నుండి విముక్తి పొందినానని అన్నారు. అధికారంలో లేకపోతేనే సుఖం, శాంతి, సంతోషం లభిస్తుంది. బానిసత్వం, బానిస మనస్తత్వం రెండు లేని వారు దేనికైన సిద్ధంగా ఉంటారు. - ఈటెల రాజేందర్ గతంలో కేసీఆర్ కు ఎట్ల తమ్ముడు... ఇప్పుడు ఎట్ల దయ్యం అయిండు. దేశానికి చైతన్యం అందించిన గడ్డ తెలంగాణ. నీ మోసాలకు త్వరలో చరమ గీతం పాడుతారని అన్నారు. రఘునందన్ రావు ఎమ్మెల్యే గా గెలువడనుకుంటే టి ఆర్ ఎస్ పార్టీ కి కర్రు కాల్చి వాతపెట్టాడు. దుబ్బాక తెలంగాణ కు చైతన్యం తెచ్చింది. మానవత్వం లేని వ్యక్తి.. మానవ సంబంధాలను మర్చేసిన వ్యక్తి కెసిఆర్. గతంలో నీవు ఎట్ల ఏడ్చినవో నేను గట్లనే ఏడ్చినా. కానీ నువ్వు బానిసవ్ నేను భరిగీసి కొట్లాడినా. అంబేద్కర్ ఇచ్చిన హక్కులను ఎవ్వడు ఆపలేడు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులు కెసిఆర్, హరీష్ రావు లు. తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒక్కటైనవి. ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యే పదవి దానిని నుండి వచ్చింది సిఎం పదవి అది మర్చిపోకు కే సి ఆర్. ఒక్క హుజూరాబాద్ ఎన్నికల్లో 600 కోట్లు ఖర్చు చేసిండ్రు టిఆర్ఎస్ వాళ్లు. తెలంగాణ లో ముగ్గురమే బిజెపి ఎమ్మెల్యేలమమే కావచ్చు కానీ రేపు మూడు వందలు కావడం ఖాయం. నున్న ఎన్నికల్లో తెలంగాణ లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని అన్నారు.