ఏలూరు
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా ఆకివీడు ఎన్నికలు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైస్సార్సీపీ నాయకులతో సమావేశమైయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ్ రాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, బీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ముదినూరి ప్రసాద్ రాజు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఎంబీసీ చైర్మన్ వీరన్న,జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, మాజీ చైర్మన్ మేక శేషుబాబు, డీసీసీబీ చైర్మన్ నరసింహారాజు,,పాతపాటి సర్రాజు, గోకరాజు రామరాజు, యోగేంద్ర బాబు,గుబ్బల తమ్మయ్య తదితరులు హజరయ్యారు. మంత్రి అళ్లనాని మాట్లాడుతూ మొదటి సారిగా ఆకివీడు నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో వైస్సార్సీపీ జండా ఎగురు వేయడానికి పార్టీ శ్రేణులు అందరూ సైనికులా పని చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లిఎన్నికలు ప్రచారంలో ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి కి ప్రజల్లో పెరుగుతున్న జనఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షం కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఏదో రకంగా ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆకివీడు ప్రజలు విజ్ఞనులు... జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అందుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు వైస్సార్సీపీకే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రజలు వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలు పక్షాన నిలబడిన నాయకుడు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా సమయంలో కూడ చేప్పిన పధకాన్ని ప్రతి పేద కుటుంబానికి అందించిన దేశంలో ఏకైక నాయకుడు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి. అసత్య అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు గుణపాఠం చేప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన ఆదరణ చూడలేక ప్రతిపక్షల్లో అసూయ పెరిగిపోతుంది. పరిపాలన మరింత సులువు చేసి ప్రజల వద్దకే పరిపాలన అందిస్తూ గ్రామ, వార్డు సచివాలయం ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలనను అందించడం జరుగుతుందని చెప్పారు.