YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కిం కర్తవ్యం... అయోమయంలో రైతాంగం...

కిం కర్తవ్యం... అయోమయంలో రైతాంగం...

నిజామాబాద్, నవంబర్ 12,
ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ పార్టీల నాయకులు సందేశాలతో తెలంగాణాలోని రైతులు అయోమయంలో పడిపోయారు.అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ వచ్చే యాసంగిలో వరి వేయకండి.. అలా వేస్తే మేము వరి ధాన్యం కొనుగోలు చేయం.. అని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్‌ మాటలపై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ రైతులు వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమంటోంది.. అందుకే మీరు వరి వేయకండని సీఎం కేసీఆర్‌ అంటుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి చెందిన నాయకుడు వరి వేయండి మేము కొనుగోల్లు చేపిస్తామంటూ చేసే వాగ్దానాలపై ఎవరి మాటలు నమ్మాలో రైతులకు ఆర్థం కావడం లేదు. ఇప్పటికే వానాకాలంలో వరి ధాన్యం కొనుగోల్లు ఆలస్యమవుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వానాకాలంలో పండించిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ సర్కార్‌ హామీ ఇచ్చినా.. యాసంగిలో వేయాల్సిన పంటలపై క్లారిటీ రాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ‘దున్నపోతు..దున్నపోతు.. పోట్లాడుకుంటే లేగదూడ కాలు విరిగినట్లు’ రాజకీయ పార్టీలు వారి లబ్దికోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రైతులు వచ్చే యాసంగిలో వరి మినహా వేరే పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించి మరీ ఓ క్లారిటీ అయితే ఇచ్చారు… కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న.. బీజేపీ నేత బండి కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయిస్తారా.. చూడాలి మరి.

Related Posts