YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కాసులు కురిపిస్తున్న తెల్ల బంగారం

కాసులు కురిపిస్తున్న తెల్ల బంగారం

అదిలాబాద్, నవంబర్ 12,
తెల్లబంగారం మెరుస్తున్నది. రైతన్నకు కాసుల వర్షం కురిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్జాతీయ మార్కెట్లో కాటన్‌కు మంచి డిమాండ్‌ పెరుగడంతో అదేస్థాయిలో రేటూ ఎగబాకుతున్నది. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు 6025ను దాటి, మొన్నటిదాకా రికార్డుస్థాయిలో 8900 పలికింది. ఇప్పుడు కాస్త తగ్గి 7900 వస్తున్నది. మొత్తంగా ప్రైవేట్‌ వ్యాపారుల హవానే నడుస్తుండగా, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పుడో చాలించుకున్నది. దిగుబడి తగ్గినా ఊహించని గిట్టుబాటు దక్కుతుండడంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతున్నదిమార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేస్తేనే ఎవుసం లాభసాటిగా ఉంటుంది. పంటమార్పిడితోనే కష్టానికి ఫలితం దక్కుతుంది. ఈ దిశగా రైతులు ముందుకు సాగాలి.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది పిలుపునివ్వగా, ఎంతో మంది రైతులు అదే బాటలో ‘సాగు’తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లి, పత్తి సాగు చేస్తున్నారు. వానకాలంలో సీజన్‌లో వేసిన పంట ఇటీవలే చేతికి రాగా, మార్కెట్లో మంచి ధర పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో కాటన్‌కు మంచి డిమాండ్‌ ఉండగా, ఈ యేడు రికార్డు స్థాయిలో మద్దతు దక్కుతున్నది.
అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్‌..
ఈ సీజన్‌లో పత్తి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకు అంతర్జాతీయ మార్కెట్లో కాటన్‌కు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్‌ లేకపోవడమే కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పత్తిని బ్రెజిల్‌, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, తదితర దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. అయితే ఈ సారి ఆయా దేశాల్లో వచ్చిన వరద విపత్తుల కారణంగా పత్తి పంటకు నష్టంవాటిల్లింది. ఆశించిన మేర దిగుమతులు రాలేదు. వచ్చిన పత్తి నాణ్యత కూడా లేదు. కరోనా సమయంలో మూతపడిన టెక్స్‌టైల్స్‌ కంపెనీల న్నీ ఒక్కసారిగా తెరుచుకున్నాయి. అవసరాలరీత్యా పత్తి బేళ్లను కొనుగోళ్లకు సిద్ధపడ్డాయి. ఇదే సమయంలో ఎప్పుడూ సీసీఐ వద్ద స్టాక్‌ ఉండాల్సిన బేళ్లు లేవు. కాటన్‌ అవసరాలు పెరిగాయి. ఇక్కడి పత్తి కావాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఆర్డర్లు పెడుతున్నాయి. గత సీజన్‌లో పతి ధర కూడా అంతంత మాత్రమేగా ఉంది. గరిష్ట ధర 4500ను దాటలేదు. తక్కువ ధరలుండడంతో రైతులు నీటి వసతులు పెరగడంతో వరి సాగు వైపు మొగ్గు చూపారు. ఫలితంగా పత్తికి డిమాండ్‌ అనుహ్యంగా పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చుకుంటే మన పత్తికి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. ఇతర దేశాల్లో పత్తి క్వింటాల్‌కు 6500మాత్రమే ఉండగా, మన దగ్గర కాటన్‌కు మొన్నటిదాకా 8900 వచ్చింది. ఇప్పుడు కాస్త తగ్గి 7900కి చేరింది. మొత్తంగా ఒక క్యాండీ(356కిలోలు)కి మార్కెట్లో 70వేలు పలుకుతోంది. పత్తి గింజల ధర 3500గా ఉంది. దీంతో ప్రైవేట్‌ వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఇదే డిమాండ్‌ ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో 10వేలకు చేరనుందని వ్యాపార విశ్లేషకులు భావిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో 1,94,734 ఎకరాల్లో పత్తి సాగైంది. సరాసరి ఎకరాకు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే 8 నుంచి 12క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉంటుంది. అయితే సీజన్‌ ప్రారంభంలో, పూత, కాయ దశలో అకాల వర్షాలు పడ్డాయి. పంట దెబ్బతిన్నది. ఎకరాకు 4 నుంచి 5క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చేనా..?అనే ఆందోళనలో రైతాంగం ఉన్నది. ఇదే సమయంలో పత్తికి డిమాండ్‌ పెరిగింది. అయితే సీసీఐ ఈ సంవత్సరం 6025 మద్దతు ధరతో కొనుగోళ్లకు రంగంలో దిగింది. అక్టోబర్‌ చివరి వారంలో మార్కెట్‌లో బ్యానర్లు కట్టింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పత్తికున్న డిమాండ్‌ దృష్ట్యా ప్రైవేట్‌ వ్యాపారులే కొనుగోళ్లకు దిగారు. సీసీఐని ఖాతా ఓపెన్‌ చేయనివ్వలేదు. 2020-21 వానకాలం సీజన్‌లో కరీంనగర్‌ జిల్లాలో సీసీఐ 1,89,244 క్వింటాళ్లు, ప్రైవేట్‌ వ్యాపారులు 24,279 క్వింటాళ్లు, సిరిసిల్ల జిల్లాలో సీసీఐ.. 2,20,760 క్వింటాళ్లు, ప్రైవేట్‌ 47,488 క్వింటాళ్లు, పెద్దపల్లి జిల్లాలో సీసీఐ 2,93,219, ప్రైవేట్‌ 1,02,804 క్వింటాళ్లు, జగిత్యాల జిల్లాలో సీసీఐ 25,373, ప్రైవేట్‌ వ్యాపారులు 2,926 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మొత్తంగా సీసీఐ మద్దతు ధరతో 7,28,596 క్వింటాళ్లు సేకరించగా, 3,95,497 క్వింటాళ్లు ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేశారు. 2021-22 సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి సీసీఐ కొనుగోలు చేయలేదు. ప్రైవేట్‌ వ్యాపారులు కరీంనగర్‌లో 47,895, సిరిసిల్లలో 36,217, పెద్దపల్లిలో 38,443, జగిత్యాల జిల్లాలో 8091క్వింటాల్స్‌ కొనుగోళ్లు చేశారు. అంటే మొత్తంగా ఇప్పటి వరకు 1,30,646 క్వింటాల్స్‌ మద్దతు ధర 6025కంటే ఎక్కువతో సేకరించారు. దిగుబడులు తగ్గినా.. అధిక ధరలతో పత్తి రైతులు ఆనంద పడుతున్నారు.ఆరుగాలం కష్టించి పండించిన పత్తి రైతుకు మంచిరోజులొచ్చాయి. రోజురోజుకూ కాటన్‌ ధరలు పెరుగుతూ పోతుండడంతో గతంలో ఎన్నడూ లేనంతా రేటు పలుకుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)మద్దతు ధర క్వింటాల్‌కు 6025ను ఎప్పుడో దాటిపోయింది. మొన్నటిదాకా రికార్డుస్థాయిలో క్వింటాల్‌ పత్తి ధర 8900 పలికింది. ఇప్పుడు కాస్త తగ్గి 7900 పలుకుతున్నది. సీజన్‌ ప్రారంభం నుంచే ప్రైవేట్‌ వ్యాపారులు పోటీపడి కొనుగోళ్లకు దిగుతున్నారు. ఆకాల వర్షాలు అన్నదాతను ఆందోళన పరిచి, దిగుబడి తగ్గినా రికార్డు స్థాయిలో ధరలతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీజన్‌లో పత్తే బంగారమైంది.మార్కెట్ల పత్తి ధర మంచిగనే ఉన్నది. రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసిన. పెట్టుబడి కోసం లక్ష దాక ఖర్చు చేసిన. మొదటి కాతల ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పదకొండున్నర క్వింటాళ్లు అమ్మిన. వ్యాపారులు క్వింటాలుకు మంచి ధర కట్టిచ్చిన్రు. కాని పెట్టుబడి ఖర్చు ఎక్కువ కావడంతో మిగులు అంతంతమాత్రమే.

Related Posts