తాడేపల్లి
మణిపాల్ ఆస్పత్రికి సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వెళ్లారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా అయన కాలికి గాయం అయింది. దాంతో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. కుడి కాలుకు వాపు వచ్చింది. డాక్టర్లు సీఎం జగన్ కాలికి వైద్య పరీక్షలు చేసారు. ఎమ్మారై స్కానింగ్ తో పాటు, జనరల్ చెకప్ చేయించుకున్నారు.