YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ నేతలకు ఇంగిత జ్ఞానం లేదు

బీజేపీ నేతలకు ఇంగిత జ్ఞానం లేదు

బీజేపీ నేతలకు ఇంగిత జ్ఞానం లేదు  బీజేపీ తీరుపై షాద్ నగర్ ఎమ్మెల్యే "అంజయ్య యాదవ్" ఆగ్రహం  షాద్ నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ భారీ ధర్నా  హాజరైన ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భీశ్వ కిష్టయ్య, చౌలపల్లి ప్రతాప్ రెడ్డి  కేంద్రం వరి కోనాలంటూ పెద్దఎత్తున నినాదాలు
అవకాశవాద రాజకీయాలకు ఆజ్యం పోస్తూ రైతులను పక్కదారి పట్టించే విధంగా, వరి కొనుగోళ్ల పై బీజేపీ పొంతనలేని వైఖరితో వ్యవహరిస్తున్నారని బీజేపీ కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలకు ఇంగిత జ్ఞానం లేదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ధాన్యం  కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో  ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు భీశ్వ కిష్టయ్య, చౌలపల్లి ప్రతాప్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, కొత్తూరు, కేశంపేట నందిగామ, చౌదరిగూడ, కొందుర్గు మండలాల నుండి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ధర్నాను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గం నుండి వందలాదిగా తరలి వచ్చారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర నేతలు చెబుతున్న మాటలకు అసలు పొంతన లేదని విమర్శించారు. పంజాబ్ తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వరి కొనుగోళ్లు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించారు. సాగు చట్టాలతో రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, కార్పోరేట్ వ్యవసాయానికి పురిగొల్పుతుంది అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ నేతల వ్యవహార శైలి ఆక్షేపణీయం అని విమర్శించారు. రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మించి రైతులకు వ్యవసాయ మనుగడ కల్పించిన కేసీఆర్ సర్కార్ పై బిజెపి నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను టిఆర్ఎస్ నాయకులు ఖండించాలని సూచించారు. మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రానికి పోయే రోజులు దాపురించాయనీ, కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అధికారంలోకి రాలేమనే భయంతో బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తూ రైతుల్ని అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దేశవ్యాప్తంగా ధాన్యం కొనేలా రైతులకు న్యాయం జరిగే విధంగా కెసిఆర్ పోరాడుతున్నారని కొనియాడారు. బిజెపి ఇక ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి,    మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, కిష్టయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, ఎంపీపీ లు వై. రవీందర్ యాదవ్, కార్యకర్తలు  పాల్గోన్నారు.

Related Posts