YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రైళ్లల్లో గంజాయి రవాణా

రైళ్లల్లో గంజాయి రవాణా

సికింద్రాబాద్
రైళ్లలో గంజాయి రవాణా అరికట్టేందుకు చేపడుతున్న తనిఖీల్లో భాగంగా పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతుంది.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున రైళ్లలో రవాణా అవుతున్న గంజాయిని రైల్వే పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి  గుట్టురట్టు చేస్తున్నారు.. రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుండి 8 లక్షల విలువైన 42 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. సికింద్రాబాద్ రైల్వే డిఎస్పి చంద్రభాను మాట్లాడుతూ గంజాయి సరఫరా నిర్మూలనకై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతున్నట్లు తెలిపారు.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బెహరా అనే వ్యక్తి ఒరిస్సా నుండి విశాఖపట్నం ఏజెన్సీ ద్వారా గంజాయిని మహారాష్ట్ర కు తరలిస్తున్నట్లు రైల్వే డి.ఎస్.పి తెలిపారు.. కోణార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా ఇచ్చాపురం నుండి ముంబై కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా గంజాయి తరలిస్తున్నన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ 10 వద్ద కోణార్క ఎక్స్ ప్రెస్ లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో 42 కేజీల గంజాయి లభ్యమైనట్లు రైల్వే ఎస్పీ పేర్కొన్నారు.. ముంబైలోని పలు ప్రాంతాలలో ప్యాకెట్లుగా చేసి గంజాయిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..

Related Posts