YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మరీ ఇంతలా... అధికారాన్ని ఇంతలా వాడేయాలా? ఇందిరా పార్క్ వద్ద టిఆర్ఎస్ ధర్నా పై విమర్శలు

మరీ ఇంతలా...  అధికారాన్ని ఇంతలా వాడేయాలా?    ఇందిరా పార్క్ వద్ద  టిఆర్ఎస్ ధర్నా పై  విమర్శలు

హైదరాబాద్ నవంబర్ 12
అలాంటిది తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు.. ఆందోళనలు చేపట్టాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. కేంద్రం వడ్లు కొనాలన్న డిమాండ్ తో.. ఆందోళనల్ని చేపట్టేందుకు రోడ్ల మీదకు వస్తున్న గులాబీ దళానికి ప్రభుత్వ పరంగా చేసి పెడుతున్న వసతుల్ని చూస్తే.. మరీ ఇంతలా అధికారాన్ని ఇంతలా వాడేయాలా? అన్న భావన కలుగక మానదు.హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ఈ రోజున టీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. అధికారపక్షం చేస్తున్న ధర్నా కావటంతో.. ఆ ప్రాంగణాన్ని 24 గంటల ముందే అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రోడ్లను శుభ్రం చేయటంతో పాటు.. వాడకుండా వదిలేసిన బాత్రూంను అక్కడి నుంచి తొలగించారు. రోడ్లకుఅడ్డంగా బారికేడ్లు.. వాహనదారులకు ఇబ్బందులు కలిగించేందుకు సైతం వెనుకాడలేదన్న విమర్శ వినిపిస్తోంది. అంతేకాదు.. సాధారణంగా ధర్నా చేసేందుకు అనుమతి కోసం పోలీసుల వద్దకు వెళితే.. ఏదో ఒక కారణం చెప్పి నో చెప్పేందుకు ప్రయత్నం చేయటంతో పాటు.. అనుమతికి నిరాకరిస్తుంటారు.అందుకు భిన్నంగా అధికార పార్టీనే ధర్నా చౌక్ వద్ద ధర్నా చేసేందుకుసిద్ధం కావటంతో.. పోలీసులు తమ విధేయతను ప్రదర్శించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ సభ్యులుచేసే ధర్నాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల్ని ఏర్పాటు చేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ అధికారపక్షం చేపడుతున్న ధర్నా కోసం జరుగుతున్న ఏర్పాట్లు.. చోటు చేసుకుంటున్న వింత పరిస్థితులు హాట్ టాపిక్ గా మారాయి. పోలీసులు.. జీహెచ్ఎంసీ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేయటం చూస్తే.. అధికారమా మజాకానా? అన్న భావన కలుగక మానదు.  అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేసేయొచ్చా? తెలంగాణలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే ఇదే భావన కలుగకమానదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామని చెప్పినా.. ఆందోళనలు నిర్వహిస్తామన్నా.. ధర్నా చౌక్ వద్ద ధర్నా కు సిద్ధమని ప్రకటించినా.. అనుకున్న సమయానికి ముందే అలా ప్రకటన చేసిన వారిని హౌస్ అరెస్టు చేసేయటం.. ముందస్తుగా అదుపులోకి తీసుకోవటం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించినట్లుగా చెప్పుకునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలోనే ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన నిర్వహిస్తామంటే ససేమిరా అనేయటం తెలిసిందే.

Related Posts